పాలమూరులో వలసలు నిరూపిస్తా…. చర్చకు సిద్దమా?

-నీ కుటుంబం తెలంగాణ వదిలి వెళతారా?
-నిరూపించలేకపోతే….రాజకీయాల నుండి తప్పుకుంటా
-గ్రూప్-1 లో ఉర్థు పరీక్షకు అనుమతి ఇవ్వడం వెనుక మహా కుట్ర
-ఉర్దూకు అవకాశమిస్తే ఒక వర్గానికే ఉన్నత ఉద్యోగ అవకాశాలు
-ఎంఐఎం చేతుల్లోకి తెలంగాణ వెళుతోంది
-పాలమూరుకు నిధులు కేటాయింపుపై శ్వేత పత్రం విడుదల చేయాలి
-దేవరకద్ర ‘ప్రజా సంగ్రామ యాత్ర’ బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్…

‘‘కేసీఆర్…. పాలమూరు పచ్చబడ్డది. వలసలు లేవన్నవ్ కదా… భీవండి, ముంబయి పోయినోళ్లంతా తిరిగొస్తున్నరని చెప్పినవ్ కదా… పాలమూరులో వలసలున్నయని నేను నిరూపిస్తా… నిరూపించలేని పక్షంలో నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా… నిరూపిస్తే నువ్వు, నీ కుటుంబం రాజకీయాలను వదిలేసి తెలంగాణ నుండి వెళ్లిపోయేందుకు సిద్ధమా?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్-1 పరీక్షను ఉర్ధూలో రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వెనుక మహా కుట్ర దాగి ఉందన్నారు. దీనివల్ల ఒక వర్గం వారికే ఉన్నత ఉద్యోగాలు పొందుతారని, హిందూ సమాజానికి భవిష్యత్తులో ఆయా ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎంఐఎం చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు.ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించేదాకా బీజైవైఎం ఆధ్వర్యంలో మహా పోరాటం చేయబోతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లా పూర్తిగా వెనుకబడిందన్నారు. సీఎంకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే పాలమూరు జిల్లాకు నిధుల కేటాయింపుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 20 రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్ సహా పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

పచ్చబడ్డ పాలమూరులో చిచ్చుపెడుతున్నాం అంటున్న trs నాయకుల కళ్ళు దోబ్బాయా ? పాలమూరు ఎలా ఎండిపోయిందో, వలసలు ఎలా పోతున్నారో కనపడడం లేదా? పాలమూరు గడ్డ.. కాషాయ పార్టీ అడ్డా. పాలమూరు ఒక పవిత్రమైన స్థలం. పాలు, మజ్జిగ సమ్రుద్ధిగా జిల్లా కాబట్టే పాలమూరు అయ్యింది. దేవదేవులు నడియాడిన నేల దేవరకద్ర.

ఎక్కడైతే చేతకాదు అన్నారో…. అక్కడే టైమ్, డేట్ చెప్పి, అక్కడే సభ పెట్టాం. ఎంఐఎం అడ్డా అన్నచోటే… అది మన గడ్డ అని నిరూపించాం. పాలమూరు అభివృద్ధి కి బీజేపీ కట్టుబడి ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే… పాలమూరు ను పచ్చబడేస్తాం…ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తాం
ఆర్డీఎస్ పనులకు పరిష్కారం చూపించాం. జీవో 69 కి అనుగుణంగా ఇక్కడి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం.

పాలమూరు గడ్డపై మాకు అవకాశం ఇస్తే… పాలమూరు ను సస్యశ్యామలం చేస్తాం.
ఆర్టికల్ 370 ను రద్దు చేశాం…అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాం.దేవరకద్రలో ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా లేదు. కనీసం R.O.B ని కూడా పూర్తిచేయలేదు. కేసీఆర్ పేరు చెప్తేనే… కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. దేశం విడిచిపోతున్నరు.

చెక్ డ్యామ్ ల పేరుతో ఒకడు రూ.120 కోట్లు, ఇసుక పేరుతో ఇంకోడు రూ.100 కోట్లు సంపాదించారు.చిన చింతకుంట మండలంలో బస్టాండ్ లేదు. కాలేజీ లేదు. 24 పడకల ఆసుపత్రి లేదు. వీటికోస రోజుకో గ్రామం చొప్పున మండల ప్రజలంతా 23 రోజులుగా దీక్ష చేసినా టీఆర్ఎస్ నేతల్లో స్పందన లేకపోవడం సిగ్గుచేటు.

కేసీఆర్ కుటుంబంలో మొత్తం 5 ఉద్యోగాలకు గాను, నెలకు రూ.20 లక్షల జీతం తీసుకుంటున్నారు. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు.దేవర కద్ర నియోజకవర్గంలో 62188 మందికి ఉపాధిహామీ పథకం కింద ఇక్కడ పని కల్పిస్తున్నాం. ఉపాధిహామీ పథకం కింద చెల్లించాల్సిన సొమ్మును కేసీఆర్ చెల్లించడం లేదు. కేంద్రం డబ్బులు ఇస్తున్నా… కేసీఆర్ ఎందుకు ఉపాధిహామీ కూలీలకు కూలీ చెల్లించడం లేదో మాధానం చెప్పాలి.

దేవరకద్ర లో టాయిలెట్స్ నిర్మాణం, రైతు వేదికలకు, పల్లెప్రకృతి వణం.. ఇలా వివిధ పథకాల కింద కేంద్రం నిధులు ఇస్తోంది. కేసీఆర్ కు లెక్కలు అప్పచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం.ఎక్కడి రమ్మంటావో చెప్పు…. మా రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటెల రాజేందర్ లను పంపిస్తాం. వాళ్లు లెక్క తేల్చేందుకు సిధ్ధంగా ఉన్నరు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ… రెండూ ఒకటే. రెండు పార్టీలు కలిసే… అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి.వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎక్కడా ఓపెన్ చేయలేదు. ఇప్పటికే 60 శాతం మంది రైతులు నష్టానికే ధాన్యం అమ్ముకున్నారు. రైతులను హరిగోస పెడుతున్న ప్రభుత్వం trs ప్రభుత్వం దొంగ దీక్షచేసి, తెలంగాణ సమాజాన్ని నమ్మించి, మోసం చేశాడు. మళ్ళీ సెంటిమెంట్ రగలించి పబ్బం గడపాలని అనుకుంటున్నాడు.వేలకోట్ల నిధులు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయిస్తోంది తెలంగాణ అభివృద్ధికి కేసఆర్ సహకరిస్తలేడు. కేంద్రాన్ని బదనాం చేయడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప, తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రం కాదు.

రాజకీయాలు తర్వాత మాట్లాడుదాం… తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుదాం అని మోడీ పిలిచినా… ఇప్పటివరకు రాలేదు కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో చెల్లించే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరిపై లక్ష పై చిలుకు అప్పులు ఉన్నాయి. అప్పులుచేసి, చిప్ప చేతికి ఇస్తున్నాడు. ఏ సర్వే చూసినా… వచ్చేది బీజేపీ అనే వచ్చాయి.

కేసీఆర్ కు తెలంగాణ ను పాలించే అర్హత లేదు. వేలకోట్ల రూపాయలను దండుకునేందుకే కేసీఆర్ .వలస లేవంటున్న కేసీఆర్ కు.. వలసలు ఏంటో ఆధారాలతో సహా నిరూపించా. అయినా కేసీఆర్ కుటుంబానికి కళ్ళు దొబ్బినై… అందుకే వలసలు లేవని అంటున్నారు.

పాలమూరు లో వలసలు లేవని నిరూపిస్తే…. నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. ఒకవేళ నువ్వు నిరూపించకపోతే… శాశ్వతంగా నీ కుటుంబం తెలంగాణ ను వదిలిపెట్టి వెళ్తారా..?
మాకు పాలమూరు లో ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా…. పాలమూరు ను అభివృద్ధి చేయాలనే ఇక్కడికి వచ్చాం. పాలమూరు అభివృద్ధి కి కేంద్రం భారీగా నిధులు ఇచ్చింది. పాలమూరుకు సేవచేసే అవకాశం మాకు ఇవ్వండి. పాదయాత్ర కు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి మద్దతు ఇస్తుంటే… మాకు సంతోషం కలుగుతోంది. గొల్లకొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేస్తాం.

నిరుద్యోగుల బాధలు వర్ణనాతీతం. అధికారంలోకి వస్తే… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది.గ్రూప్-1 నోటిఫికేషన్ లో ఉర్దూను చేర్చడాన్ని కుహనా సెక్యూలర్ వాదులు సమర్ధించుకుంటారా?. రీజనబుల్ లాంగ్వేజ్ ఉండాలి కానీ, రిలీజియన్ లాంగ్వేజ్ ఉండొద్దు.

ఎంఐఎం కోసమే టీఆర్ఎస్ నాటకాలు ఆడుతోంది. తెలంగాణను ఎంఐఎం చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోంది.గ్రూప్-1 లో ఉర్ధూ భాషలో పరీక్ష రాయడానికి అనుమతించడంవల్ల రాబోయే రోజుల్లో ఏ ఒక్క హిందూ యువకునికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ సమర్ధించే ప్రసక్తే లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాడతాం.
ఎల్లుండి పాలమూరు గడ్డపై జేపీ నడ్డా అడుగుపెడుతున్నారు. పాలమూరు సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని ప్రజలను, కార్యకర్తలను కోరుతున్నా.

Leave a Reply