రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని కలిసి ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలు,డూప్లికేట్ ఓట్లు,డీ రిజిస్ర్టేషన్ (తెలంగాణా) మరియు ఓటర్ల రీఎన్ రోల్ మెంట్ (ఆంధ్రప్రదేశ్)లపై ఫిర్యాదు చేసిన వైయస్సార్ సిపి.
రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు లు రాష్ట్ర సచివాలయంలో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
డూప్లికేట్ ఓట్లు,డీ రిజిస్ర్టేషన్(తెలంగాణా) ఓటర్ల రీ ఎన్ రోల్ మెంట్ (ఆంధ్రప్రదేశ్) వల్ల ప్రజాస్వామ్యస్పూర్తి దెబ్బతింటోందని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్సార్ సిపి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ ని కలసి ఫిర్యాదు చేసింది. తెలుగురాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో ఈ డూప్లికేట్ ఓట్ల అంశం ఉందని తాము గుర్తించామని ఆ ఫిర్యాదులో పేర్కొంది.
ఒకే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్,తెలంగాణాలలో ఓటు ఉందని వివరించారు. ఇందుకు సంబంధించి తగిన ఆధారాలను ఫిర్యాదుకు జతచేశారు. రాష్ట్ర మంత్రులు జోగిరమేష్,మేరుగ నాగార్జున,శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి,శాసనసభ్యుడు మల్లాది విష్ణులు మీనాను కలసి ఫిర్యాదు అందించారు.
ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాకు వాటికి సంబంధించిన వివరాలు అందించారు.రాష్ట్ర మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒక ప్రాంతంలోనే ఓటు ఉండాలని.అయితే ఒకే వ్యక్తికి రెండు, మూడుచోట్ల ఓటు ఉన్నట్టు తమ పార్టీ గుర్తించిందని అన్నారు.ముఖ్యంగా తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లలో రెండుచోట్ల కొందరికి ఓట్లు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు.ఇలాంటివి కొన్ని మేము గుర్తించామని వాటి గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించడం జరిగిందన్నారు. ఎన్నికలలో పోటీ చేయలేని టీడీపీ నేతలు కొందరు మాపార్టీపై రోజూ ఎల్లోమీడియాలో వార్తలు రాస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల సిబ్బంది లక్షల ఓట్లు తొలగించారని ఒకరోజు, లక్షల ఓట్లు చేర్పించారని ఇంకోరోజు రాస్తున్నారని,రానున్న ఎన్నికలలో ఎలాగూ ఓడిపోతామని తెలిసే టిడిపి అనుకూల పచ్చమీడియా అలాంటి రాతలు రాస్తున్నారు.ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని మేము మొదటి నుండి చెప్తున్నామని అన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత 70 రోజులు పత్తా లేకుండా పారిపోయిన లోకేష్, మంత్రులకు భయం చూపుతాడంట అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలో టిడిపి ఓటమి ఖాయమని అన్నారు.
రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ సెప్టెంబర్ 2023న ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఏపి,తెలంగాణాలలో రెండుచోట్ల 16 లక్షల ఓట్లకు పైగా ఉన్నాయని అన్నారు. వాటిని వెదికి అలా గుర్తించినవాటిని తొలగించాలని కోరామన్నారు.1950 పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 17 ప్రకారం ఏ నియోజకవర్గంలోనైనా ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటుహక్కు ఉండాన్నారు.దానిప్రకారం చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.తెలంగాణాలో ఈనెల 30 వతేదీన ఎన్నికలు జరుగుతున్నాయని,అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని,అక్కడ ఓట్లు క్యాన్సిల్ చేయించుకుని ఇక్కడ ఓటుహక్కు వినియోగించుకునే విధంగా చేస్తున్నారన్నారు.
కొన్ని పత్రికలు,మీడియా కలసి ప్రభుత్వంపై,వైయస్సార్ సిపి పై ఎన్నికల కమీషన్ ను తప్పుదోవ పట్టించేవిధంగా ఓట్లు చేర్పిస్తున్నామని,అక్రమంగా తొలగిస్తున్నారని తప్పుడు ఫర్యాదులు చేస్తూ వాటిని హైలెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.మాకు ఆ అవసరం లేదన్నారు.నిజంగా ఆ విధంగా జరుగుతుంటే పలానా ఊర్లో జరుగుతుందనో,లేదా చేరుస్తున్నారనో ఆధారసహితంగా ఫిర్యాదు చేయాలి.అలా చెప్పలేక చేవలేక అభూతకల్పనలతో దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారన్నారు. రాష్ర్ట ప్రజలలో ఒకరికి ఒకే ఓటు ఉండాలనేది ముఖ్యమంత్రి వైయస్ జగన్,వైయస్సార్ సిపి నినాదం అన్నారు.
పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు ఓటు వేసి తర్వాత మన రాష్ర్టంలో జరిగే ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చేవారిపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. అధికారులకు క్లియర్ గా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం,రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనేది తమ నినాదం అన్నారు.
ఆధార్ లింకేజ్ లేకపోవడం వల్ల అలా తొలగింపు వీలుకాదని ఎన్నికల సంఘం అంటోందనే విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాము ఎన్నికల సంఘానికి ఆధారాలు అందించామని వివరించారు.
పూర్తిస్థాయి విచారణ జరిపి,తప్పుదోవపట్టించేవిధంగా చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి కోరుతున్నామని మంత్రులు జోగిరమేష్,మేరుగనాగార్జునలు చెప్పారు. ఉద్యోగులను పావులుగా వాడుకోవాలనే ఆలోచన మా ప్రభుత్వానికి గాని,పార్టీకి గాని లేదన్నారు. యుధ్దానికి రాకుండానే అస్ర్తసన్యాసం చేసే సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు,పవన్ కల్యాణ్ లే అని అన్నారు.