ఎ.పిలోని జల రవాణా అభివృద్ధికై పోర్టులు-ఓడ రేవులు

– రాజ్యసభలో జీవీఎల్
రాజ్యసభలో రాజ్యసభ సభ్యులు , రాష్ట్ర DISHA కమిటీ కేంద్ర ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందు పోర్టుల సామర్థ్యం మరియు వాటి పనితీరు గూర్చి కేంద్ర జలరవాణా మంత్రిత్వ శాఖను ప్రశ్నిస్తూ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ మరియు ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి పోర్టుల వివరాలు, సామర్థ్యం,మరియు లాభాల వారీగా వాటి వివరాలు అందించమని,దుగ్గరాజుపట్నం పోర్టుకు బదులుగా మరియొక పోర్టుకు గల ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఉన్నదా అని,ఆంధ్రప్రదేశ్ నందు ఏదైనా పెద్ద స్థాయి పోర్టు నిర్మాణానికి సరిపోయేటువంటి మరొక ప్రదేశాన్ని ఇప్పటివరకు మంత్రిత్వశాఖ ఏదైనా గుర్తించిందా అని,ఒకవేళ లేనిచో దానికి కారణం ,రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు లేకపోవటం లేదా అనువైన ప్రదేశం లభించకపోవడం వంటి కారణాలేమైన ఉన్నాయా అని,కేంద్ర పోర్టులు,ఓడరేవులు మరియు జలరవాణా మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా సంబంధిత మంత్రివర్యులు శర్వానంద్ సోనోవాల్ సమాధానమిస్తూ,
రాష్ట్రమునందు విశాఖపట్నం కాకినాడ మరియు రవ్వ పోర్టులు ప్రభుత్వాధీనంలో పనిచేస్తున్నాయని , కాకినాడలోని జలాంతర పోర్టు ,గంగవరం మరియు కృష్ణపట్నం పోర్ట్ లు ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్నవని తెలియజేశారు. వీటన్నిటిలోకి విశాఖపట్నం పోర్ట్ అత్యధికంగా 126.89 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 909.16 కోట్ల ఆదాయంతో ప్రధమ స్థానంలో ఉన్నదని తెలియ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం దుగ్గరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం కోరింది కానీ తరువాత దానిని స్వయంగా నాన్-మేజర్ పోర్టుగా నిర్మించటానికి 20-02-2020 తేదీన నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. నాన్-మేజర్ పోర్టు కనుక దాని నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ, రాష్ట్ర మారిటైం బోర్డు పరిధిలోనే ఉంటుందని తెలియచేసారు.