– రవీంద్ర భారతిలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: తల్లిదండ్రులతో సమానంగా మాతృదేవో భవన్ పితృదేవో భవన్ ఆచార్య దేవోభవ అని అధ్యాపక వృత్తిలో చేరుతున్న మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన అభినందనలు.ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజా పాలనకు నాయకత్వం వహించి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు.
విద్యార్థి నాయకుడిగా మీ ముందు మాట్లాడుతున్న గత పది సంవత్సరాలుగా విద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది. నియామకాలు లేక కనీసం యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్ లర్ లను నియమించలేని పరిస్థితి నుండి మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం అనేక సమస్యలను తొలగించింది.మొదటగా అధ్యాపక వర్గానికి అసహనాన్ని తొలగించి ప్రమోషన్లు , వారికి సంబంధించిన బదిలీలు చేపట్టి విద్యావ్యవస్థ లో ప్రాథమిక స్థాయిలో నుండి మార్పులు చేపట్టాం.
వైస్ ఛాన్సలర్ లా నియామకం ప్రొఫెసర్ ల వయస్సు పెంచడం ,ప్రభుత్వ కాలేజి ల బలోపేతం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థ బాగుండాలని అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించడం.హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ మెస్ ఛార్జీలు పెంచాం. 55 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ లకి 200 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశారు.
ఈ పవిత్రమైన వస్తున్న అధ్యాపక వర్గానికి ప్రభుత్వ సంకల్పాన్ని ఆలోచించి భవిష్యత్తులో ప్రభుత్వ సంస్థల్లో చదువుకుంటే గౌరవం అనే విధంగా నియామక పత్రాలు పొందుతున్న మీ అందరికీ శుభాకాంక్షలు.