– తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు పంపాలని నిర్ణయం
హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు పంపాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని, సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని నాయకులు, కార్య కర్తలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.