– ఫార్మాసిటీ స్టాప్డ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గని శెట్టి డిమాండ్
పరవాడ: ఫార్మా సిటీలో జూన్ 11వ తేదీన ప్రమాదకరమైన విష వాయువు విడుదల కావడంతో ఇద్దరు కార్మికులు ఆ వాయువులను పీల్చి మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత 75 రోజుల వరకు కమిటీ కూడా నియమించకుండా, ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై ఫార్మసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
ఫార్మా పరిశ్రమంలో జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం కనీసం జరిగిన వెంటనే కమిటీ నియమించడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందని, జరిగిన ప్రమాదం పై విచారణ చేయడంలో తీవ్ర జాప్యం చేసిందని గని శెట్టి అన్నారు. శనివారం ఆయన పరవాడలో విలేకరులతో మాట్లాడుతూ, 75 రోజుల తర్వాత ప్రమాదంపై కమిటీ ఏర్పాటు చేయడం అంటే యాజమాన్యానికి ప్రభుత్వం కొమ్ము కాయడమే అన్నారు.
ఏదైనా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగితే వెంటనే కమిటీ ఏర్పాటు చేసి వివరాలు రాబడతారు. అప్పుడు వేస్తేనే కమిటీ వాస్తవాలు కూడా బయటపడతాయి. కానీ అలా కాకుండా 75 రోజులు తర్వాత కమిటీ ఏర్పాటు చేయడమంటే, ఇంతకంటే సిగ్గుచేటు అయిన విషయం మరొకటి ఉండదని గని శెట్టి అన్నారు. వ్యర్థ జలాల ట్రీట్మెంట్ ప్లాంట్ న్యుట్రలైజేషన్ చేస్తుండగా పరిశీలనకు వెళ్ళిన ఇద్దరు భద్రత విభాగానికి చెందిన ఉద్యోగులు, ట్యాంక్ మాన్యువల్ నుంచి వచ్చిన ప్రమాదకరమైన వాయువులను పీల్చడం వల్లనే మరణించారని కమిటీ నిర్ధారించిందని అన్నారు.
కంపెనీలో ఇంకా 80 కిలో లీటర్ల వ్యర్థ జలాల స్టోరేజ్ ట్యాంక్ లో ఉంది. దానిని వెంటనే బయటకు తరలించాలని, స్టోరేజ్ ట్యాంక్ ప్రాంతంలో వాయువులను గుర్తించే పరికరాలు ఏర్పాటు చేయాలని, ఎస్ఓపి పాటించాలని, స్టోరేజ్ ట్యాంకు స్క్రబ్బర్ విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసి వాటి రీడింగ్ ప్రతినెలా కాలుష్యం నియంత్రణ మండలి కి పంపించాలని సూచనలు చేశారు. జాయింట్ కమిటీ ఇన్స్పెక్షన్ చేసిన ఇంకా అనేక లాభాలను బయట పెట్టలేదని ఫార్మసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అభిప్రాయం పడుతుందన్నారు.
పరిశ్రమలో అంతర్గత భద్రత వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని గని శెట్టి అన్నారు. పరిశ్రమలో స్క్రబ్బింగ్ విధానం లోపాలు ఉన్నాయని దానిని తప్పు పట్టలేదని అన్నారు. నిర్వహణ లోపాలు భద్రత వైఫల్యాలు అంశాలను విస్మరించిందని అన్నారు. ఏ పరిశ్రమలో అయినా ప్రమాదం జరిగిన వెంటనే 48 గంటల్లో విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రమాదంని గుణపాఠంగా తీసుకొని యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు. సాయి శ్రేయస్ పరిశ్రమ యాజమాన్యంపై ఈ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు.