– ప్రణాళిక లేకుండా జిల్లాలు ఎందుకు?
– ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
-అద్దంకికి బాపట్ల, చీరాల రెండు దూరమే,అఘమేఘాల మీద జిల్లాల ఏర్పాటుతో ప్రయోజనం లేదు
– కొత్త ప్రతిపాదనతో అద్దంకి నియోజకవర్గానికి తీరని నష్టం
– రెవిన్యూ డివిజన్లు తొలుత సరి చేయాలి
– పేపర్ లోను, చెప్పుకోవడానికి మాత్రమే జిల్లాలు
– భవనాలు, మౌళిక వసతులు లేకుండా జిల్లాలా….?
– రాష్ట్రంలోని సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు జిల్లాల ప్రస్తావన
– రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకు కూడా లేని స్థితిలో జిల్లాల ఏర్పాటు అవసరమా…?
ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్న వాటిని పట్టించుకోకుండా ఆఘమేఘాల మీద జిల్లాల ఏర్పాటు వలన ప్రయోజనం ఉండదని అందులోను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన అద్దంకి నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
అద్దంకి నియోజకవర్గాన్ని సుమారు 120 కిలో మీటర్ల దూరంలో ఉండే బాపట్ల జిల్లాలో ప్రతిపాదించడం వలన ప్రజలకు ఇబ్బందులు ఉండాయన్నారు. దీంతోపాటు ఇప్పటి వరకు అద్దంకి నియోజవకర్గం ఒంగోలు డివిజన్లో కొనసాగగా దానిని చీరాల డివిజన్ కు ప్రతిపాదించరని దీని వలన అద్దంకి నియోజకవర్గానికి జిల్లా కేంద్రంగా ప్రతిపాదించిన బాపట్ల, డివిజన్ కేంద్రం చీరాల రెండు దూరంగా ఉండటం వలన నియోజవకర్గం నష్టపోతుందన్నారు.
ప్రభుత్వం తొలుత రెవిన్యూ డివిజన్ల విషయంలో స్పషత తీసుకొని సమీప ప్రాంతాలను రెవిన్యూ డివిజన్లలో విలీనం చేసి జిల్లాకు అవసరమైన మౌళిక వసతులు కల్పించి జిల్లాల ప్రకటన చేయాలి కాని పేపర్ మీద, చెప్పుకోవడానికో జిల్లాలు చేయడం వలన ప్రయోజనం ఏంటని ఎమ్మెల్యే రవికుమార్ ప్రశ్నించారు. రాష్ట్రం ఇప్పడున్న పరిస్థితిలో జిల్లాల ఏర్పాటు అవసరం లేదని సమస్యలు అనేకం ఉన్న వాటిని పరిష్కరిచడం కోసం కృషిచేయకుండా సమస్యలను ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త జిల్లాలు, డివిజన్ల ప్రతిపాదన తీసుకొని వచ్చిందని విమర్శించారు.
ఇప్పటికే రాష్ట్రంలో మచ్చుకు కూడా అభివృద్ధి లేని పరిస్థితుల్లో జిల్లా ఏర్పాటు అని చెబుతున్నారు. వాటికి భవనాలు ఎక్కడ ఉన్నాయి. అధికారులు ఎవరు అనే దానిపై స్పష్టత లేకుండా ప్రభుత్వం ఉందన్నారు. జిల్లా ఏర్పాటు విషయంలో తొలుత రెవిన్యూ డివిజన్ల విషయంలో స్పష్టత తీసుకొనిరావాలని లేకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. అద్దంకిని ఒంగోలు డివిజన్ లో కొనసాగించడంతోపాటు ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని ఎమ్మెల్యే గొట్టిపాటి డిమాండ్ చేశారు.