Suryaa.co.in

Andhra Pradesh

జగన్ హామీలన్నీ అందని ద్రాక్ష

– గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ

ఆంధ్రప్రదేశ్ లో వైకాపా హయాంలో ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండరు మెగా డిఎస్సి పైన ముఖ్యమంత్రి జగన్ హామీలన్నీ “అందని ద్రాక్ష “గానే మారాయని 2024 జనవరి ఒకటికి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవటం ఏంటని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాబ్ క్యాలెండరు -2024 ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ఎండగడుతూ తెలుగుయువత వినూత్న నిరసన
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇస్తామన్న ఉద్యోగాలు , జాబ్ క్యాలెండర్లు మెగా డిఎస్సి లన్ని అందని ద్రాక్ష లే అంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో భారీ ద్రాక్ష పండ్ల గుత్తులకు ” జాబ్ క్యాలెండరు -2024 ఎక్కడ మెగా డిఎస్సిలు ఎక్కడ అని వ్రాసి ఉన్న ప్లకార్డులు అమర్చి వైకాపా ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి జగన్ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ అందని ద్రాక్షలే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అందుకునే ప్రయత్నం చేస్తూ నిరసన తెలియజేసారు.

ఈ సందర్భంగా రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండరు మెగా డిఎస్సి హామీలను ఒక్కరోజుకూడా ముఖ్యమంత్రి జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యోగాలు భర్తీ పైన జగన్ హామీలన్నీ అందని ద్రాక్షగానే మారిందని జగన్ అధికారం వచ్చాక ఎపిపిఎస్సి ద్వారా పట్టుమని పది వేల ఉద్యోగాల్లో కూడా భర్తీ చెయ్యలేదని అటూ ఇటుగా కేవలం 5వేల ఉద్యోగాలే భర్తీ చేసారు గాని చివరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసి వాలంటీర్లను నియమించి అవే ఉద్యోగాలని ప్రచారం చేసుకున్నారన్నారు.

అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిలు నిర్వహించి 23 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఊదరగొట్టి ఒక్కటంటే ఒక్క పోస్టు భర్తీ చెయ్యలేదని రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది టెట్ అర్హత సాధించిన నిరుద్యోగులు డిఎస్సి కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని అన్నారు.

రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాడానికి వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నో మోసపూరితమైన వాగ్దానాలు చేసి సమాజంలో అధిక సంఖ్యకులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువకులు ఎక్కువగా నిరుద్యోగులుగా ఉన్నారు వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే వారందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నాలుగున్నర సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వకపోవడం వలన దాదాపుగా 1345 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు దీనికి జగన్ మోహన్ రెడ్డి కారణం కాబట్టి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని బేషరత్తుగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియుసి కార్యదర్శి మదమంచి శ్రీనివాస్ రావు,జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్,జిల్లా అధికార ప్రతినిది బాజీ వెంకట రావు ,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మన్నెం శ్రీనివాస్ రావు,కార్యదర్శి పటాన్ అథావుల్లా ఖాన్, గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుయువత ఉపాధ్యక్షులు ఉప్పుటూరి వెంకటేష్,కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి రాంబాబు, గుంటూరు పశ్చిమ కార్యదర్శి కోలా మల్లికార్జునరావు,టిడిపి నేతలు అమర్నాద్,కొల్లి నాగుల్,-మచ్చు దేవా ,షేక్ సుభాని,షేక్ ఉమాయున్ ,తెలుగుయువత నేతలు చిక్కాల శివరామ కృష్ణ,షేక్ రఫీ,శేషాద్రి సాంబశివరావు,శొంఠినేని అనిల్,బుల్లా కుమార్ బాబు,పొట్లూరి వెంకటేశ్వరావు,సన్నపు ఆదిత్య రెడ్డి,చింతా వినోద్,సింగు నాగమల్లేశ్వర రావు, ఉపేంద్ర, జి పుష్ప రాజు యువత పాల్గున్నారు.

LEAVE A RESPONSE