జగన్ చేసిన అభివృద్ధి అంతా రంగురాళ్లకు,కాగితాలకే పరిమితమైంది

• క్రిస్మస్ వేడుకల పేరుతో జిల్లాకు రావడం, ఎక్కడపడితే అక్కడ పునాదిరాళ్లు, శిలాఫలకాలు వేయడం, నోటికొచ్చిన వాగ్ధానాలు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది.
• రెండుసార్లు క్రిస్మస్ జరుపుకోవడానికి సొంతజిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి, రేపు ఒకసారి తాను గతంలో వేసినపునాదిరాళ్లను చూస్తే, ఆయనచేసిన వాగ్ధానాలు ఏమిటో అప్పుడైనా గుర్తొస్తాయి.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి

ముఖ్యమంత్రి ముచ్చటగా మూడోసారి క్రిస్మస్ పండుగజరుపుకోవడానికి సొంతజిల్లాకు వచ్చారని, మూడుసార్లు జిల్లాపర్యటనకు వచ్చినప్రతిసారీ ఆయన వేలకోట్లరూపాయల నిధు లు జిల్లాకు కేటాయిస్తున్నట్లు ప్రకటనలుచేసి, శంఖుస్థాపనఫలకాలు, పునాదిరాళ్లు వేశారు తప్ప, ఎక్కడా ఒక్కటంటే ఒక్కపని ప్రారంభించి, పూర్తిచేసింది లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గపార్టీ అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి దెప్పి పొడిచారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో టీడీపీనేత రామగోపాల్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు వారిమాటల్లోనే …!

ముఖ్యమంత్రి అయ్యాక క్రిస్మస్ వేడుకలకోసం తొలిసారి కడప జిల్లాకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రాయచోటి నియోజకవర్గంలో రూ.3వేలకోట్లఅభివృద్ధిపనులకు శంఖుస్థాపనలు చేశాడు . దానికి సంబంధించి రూపాయినిధులివ్వడంగానీ, తట్టమట్టివేయడం గానీ జరగలేదు. రెండో సారి వచ్చినప్పుడు కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో వేలకోట్లపనులకు సంబం ధించి శంఖుస్థాపనలు, శిలాఫలకాలు వేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జగన్మోహన్ రెడ్డి కడపకు వచ్చారు.

తాజాగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రూ.500కోట్లతో అభివృద్ధిపనులకు శంఖుస్థాపనలు చేయడానికి సిధ్ధమయ్యారు. ముఖ్యమంత్రిహోదాలో కడ పకు రావడం, పునాదిరాళ్లు, శిళాఫలకాలు వేయడం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఏనాడైనా తానుప్రకటించిన పనులకు సంబంధించి జిల్లామంత్రులు,అధికారులతో ఒక్కసమీక్ష అయినా చేశారా అని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి చుట్టపుచూపుగా జిల్లాకురావడం, కంటితుడుపు గా ప్రజలకుహామీలిచ్చి, గ్రానైట్ రాళ్లపై పేర్లువేయించుకొని వెళ్లడం ఆయనకు అలవాటుగా మారింది.

రూ.500కోట్లతో కుందూనదిపై లిఫ్ట్ అంటూ రెండేళ్లక్రితం పునాదిరాయి వేశాడు. ఇంతవరకు అక్కడ చిన్నఇటుకకూడాపెట్టలేదు. జీఎన్ఎన్ఎస్ కాలువనుంచి తన నియోజక వర్గంలోనిచక్రాయపేట మీదుగా వెనిగళ్లుకు రూ.500కోట్లతో పైప్ లైన్ వేస్తానన్నాడు.. అదిఏమైందో తెలియదు. కనీసం దానిపై

అంచనాలుకూడా రూపొందించలేకపోయాడు. బద్వే ల్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగకముందు పెద్దపెద్ద వాగ్దానాలు ఇచ్చాడు. ఇంతవరకు ఒక్కటీ నెరవేరలేదు. తనసొంత నియోజకవర్గంలోని చక్రాయపేటలోని గండిక్షేత్రంలోకాజ్ వే తెగిపోయి, అక్కడున్న గ్రామాలప్రజలు వరదల్లో సర్వంకోల్పోయి, చుట్టూ 70కిలోమీటర్లు తిరిగివస్తున్నా, కాజ్ వే ఏర్పాటుదిశగా ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు.

పింఛా నదిపై అన్నమయ్యప్రాజెక్ట్ డ్యామ్ కొట్టుకుపోయింది..దాని ఊసుఈ ముఖ్యమంత్రి ఎత్తడు. రెండు న్నరేళ్లనుంచి ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, చేస్తానన్న అభివృద్ధిపనులు కాగితాలకు, రంగురాళ్లకే పరిమితమయ్యాయి. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తాను గతంలో వేసిన పునాది రాళ్లు, శిలాఫలకాలు ఎక్కడెక్కడఉన్నాయో ఒక్కసారి తిరిగివెళ్లి పరిశీలిస్తే, తమనాయకుడు ఇన్నాళ్లకు మేలుకున్నాడని ప్రజలు గుర్తిస్తారు.

ప్రజలను, మరీ ముఖ్యంగా సొంతజిల్లా ప్రజలను మభ్యపెట్టడానికే ముఖ్యమంత్రి అభివృధ్ధి జపంచేస్తున్నాడుతప్ప, ఎక్కడా వీసమె త్తు పనిచేయలేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్లుతెరిచి, మొన్నవరదలవల్ల కడపజిల్లా లోజరిగిన నష్టాన్ని యుద్ధప్రాతిపదికన పూరించడానికి చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేస్తు న్నాం. ఆయన తనజిల్లాలో ఉన్నప్పుడే దానిపై స్పష్టమైన ప్రకటనచేయాలని, లేకుంటే రాబోయేరోజుల్లో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలోకడపజిల్లావ్యాప్తంగా మహాధర్నానిర్వహిస్తా మని స్పష్టంచేస్తున్నా.

భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి (టీడీపీనేత) : జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉట్టికి ఎగరలేనమ్మ, ఆకాశానికి ఎగురుతాను అన్నట్లుగా ఉంది. కడపజిల్లాలో గ్రామాల్లోని లింక్ రోడ్లను కలుపు తూ నిర్మించాల్సిన రోడ్లనిర్మాణానికి 25-10-2019న రూ.360కోట్లు మంజూరుచేస్తే, ఇప్పటి వరకు కనీసం రూ.3పైసలు కూడా ఖర్చుపెట్టలేదు. గాలేరునగరి నుంచి పులివెందులలోని చక్రాయపేటమండలంలోని కాలేటివాగుకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఏర్పాటుకి ప్రారంభోత్స వం జరిగి రెండేళ్లు అవుతోంది. ఇంతవరకు ఒక్కరోజుకూడా ముఖ్యమంత్రి దానిపై ఆలోచన చేయలేదు.

పులివెందులను పారిశ్రామికంగా అభివృద్ధిచేస్తున్నట్లు ప్రకటించి గతసంవత్సరం డిసెంబర్ 24న అపాచీ లెదర్ ఫ్యాక్టరీనిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ముఖ్యమంత్రి, అక్కడ కనీసం కంపచెట్లుకూడా పీకించలేకపోయా డు. తాజాగా రేపోమాపో మరోసారి ఆదిత్యబిర్లా కంపెనీ ఏర్పాటుకు శంఖుస్థాపన చేస్తున్నాడు. అదికూడా మరో అపాచీ అవుతుందని అక్కడి వారే చెప్పుకుంటున్నారు. పులివెందులలో మెడికల్ కళాశాల కడతామన్నాడు.. దానికీ అతీగతీ లేదు.ఫౌండేషన్ లెవల్ కు వచ్చాక సంబంధిత కాంట్రాక్టర్ పనులు ఆపేసి వెళ్లిపో యాడు. సొంతజిల్లాలోపనులు చేసేవారికే ఈముఖ్యమంత్రి నిధులు ఇవ్వడంలేదు. ఇక రాష్ట్రం లోని కాంట్రాక్టర్లకు ఏమిస్తాడు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అనేకపథకాలు, అభివృద్ధిపనుల న్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, తననియోజకవర్గాన్నే పట్టించుకోని ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేస్తాడని ప్రశ్నిస్తున్నాం.

Leave a Reply