Suryaa.co.in

Telangana

ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసింది. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా , పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే.

LEAVE A RESPONSE