ఏపీ సీఎంఓలో అధికారులకు శాఖల కేటాయింపు

– ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులకు స్పెషల్ సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి శాఖలు కేటాయించారు.

స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డికి .. జీఏడీ, హోంశాఖ, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్యశాఖ, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్ సబ్జెక్టులు కేటాయింపు.

సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోక్యరాజ్ కు.. పౌరసరఫరాలు, విద్యా శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,గనుల శాఖ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు కేటాయింపు.

సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి … ఆర్థిక , ప్రణాళిక శాఖలు, ఇరిగేషన్, వ్యవసాయ అనుబంధరంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంథన శాఖ, పర్యాటక, యువజన సర్వీసులు , మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు కేటాయింపు.

సీఎం అడిషనల్ సెక్రెటరీ ముత్యాలరాజుకు .. ప్రజాప్రతినిధుల వినతులు, రెవెన్యూ (ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్),హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాల శాఖలు, కార్మిక, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలు కేటాయింపు.

Leave a Reply