Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ సెంట్రల్‌ ఆఫీసులో ఘనంగా అల్లూరి జయంతి వేడుక

– నివాళ్లు అర్పించిన నేతలు

మంగళగిరి: స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి స్ఫూర్తితో యువత ముందుకు నడవాలి. స్వాతంత్ర సమరయోథులను ఎప్పుడూ మనం స్మరించుకోవాలి. నేటి స్వేచ్ఛ వారి త్యాగఫలేమనన్నది గుర్తుపెట్టుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. అల్లూరి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.

ఆ యోధులు కలలుగన్న సమ సమాజ స్థానకు మనం కృషి చేయాలి. పోరాటంతో వచ్చిన స్వతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరు భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, నారా లోకేష్ లు అనునిత్యం ఇటివంటి మహనీయుల స్పూర్తితో ముందుకు వెళ్తున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం పనిచేస్తున్నారు. పేదలకు సంక్షేమాన్ని అందించేందుకు పనిచేస్తున్నారు. నేడు కూటమి పాలనలో మన్యంలో జరగుతున్న అభివృద్ధి పనులే దీనికి నిదర్శనం

పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ భారతీయులను బానిసలుగా చూస్తున్న బ్రిటీష్ మూకలకు ముచ్చెమటలు పట్టించి.. భారత ప్రజలకు స్వేచ్ఛావాయులను అందించేందుకు పోరాడి అమరుడైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మనందరికి ఎంతో ఆదర్శం.. ఇటువంటి పోరాట వీరుల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా మనగలుతున్నాం. కావున ప్రతి ఒక్కరు అల్లూరిని ఆదర్శంగా తీసుకొని మంచి సమాజం కోసం ముందుకు నడవాలి. సమాజంలో అసమానతలను రూపు మాపాలి. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి వైపు నడవాలి.. దేశం కోసం వారు కన్న కలలను నిజం చేయాలి. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. భావితరాల భవిష్యత్ కు మంచిబాటలు వేయాలి.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, చైర్ పర్సన్ సజ్జా హేమలత, అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, పర్చూరికృష్ణ, బొద్దులూరి వెంకటేశ్వరరావు, ఎం.సత్యవాణి తదితర నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE