– సామాజిక మాధ్యమం ‘X’లో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్
అమరావతి : సంకల్పబలం, ప్రణాళికా సామర్ధ్యం, పర్యవేక్షణా పటిమ ఉంటే ఏదైనా సాధించవచ్చని విశాఖ వేదికగా జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిరూపించింది. సదుద్దేశంతో పాలకులు తీసుకునే నిర్ణయాలకు ప్రజలు మద్దతిస్తారని నెల రోజుల పాటు సాగిన యోగాంధ్ర కార్యక్రమం నిర్ధారించింది.
దేశ, విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ జూన్ 21న తన విశిష్టతను చాటుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. ఇది అద్భుతం..ఆమోఘం..
అనిర్వచనీయం. మన రాష్ట్రానికి దక్కిన మహా యోగం.
ఈ ఘన విజయానికి కర్త, కర్మ, క్రియ అయిన ముఖ్య మంత్రి కి శుభాభినందనలు. యోగాకు అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని కల్పించి, ప్రజలను భాగస్వాములను చేసి, ఒక ఉద్యమాన్నే నిర్మించిన ప్రధాని నరేంద్ర మోది కి ధన్యవాదాలు.
ఈ ఘన విజయానికి కారకులైన రాష్ట్ర ప్రజలు, అధికారులకు, కూటమి కార్యకర్తలకు ధన్యవాదాలు. మన దైనందిన జీవితంలో నేటి నుంచి యోగాను దినచర్యగా చేసుకుని నిష్కల్మషంగా, సదాలోచనలతో , మానసిక ప్రశాంతతతో జీవిద్దాం.