-మాజీమంత్రి జవహర్
జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోతో అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ మండిపడ్డారు.పచ్చి వ్యభిచార ప్రవృత్తి కలిగిన అంబటిలాంటి వ్యక్తులను చూసి సభ్యసమాజం సిగ్గుతో తల దించుకుంటుందని జవహర్ ఆవేదన వ్యక్తంచేశారు. నేతల కుటుంబంలోని వ్యక్తులను బయటకు లాగటం కుసంస్కారులకు మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేశారు . గతంలో చాణక్యుని శపథం చరిత్ర చూసిందని గుర్తుచేశారు. అదే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు శపథం లతో రాష్ట్ర గతిని మారుస్తుందని పేర్కొన్నారు. మంత్రి కొడాలి నాని కుక్కలాగ మొరగడం సభ్యత కాదన్నారు. మొరిగే కుక్కలకు రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ది చెపుతారన్నారు. మహిళలను కించపరిచేటట్లు మాట్లాడే సభ పట్ల మహిళలు స్పందించాలని జవహర్ పిలుపునిచ్చారు.