– పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ ఫోటో పెట్టడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదు
– దళిత బంధు, రైతు బంధు లాంటి పథకాలు తేవాలంటే ‘కలేజా’ ఉండాలి
– ఆ కలేజా ఉన్న నాయకుడు కేసీఆర్
– గురుకులాల్లో మరణ మృదంగం
– ఆహార కల్తీ, ఆత్మహత్యల వల్ల 130 మందికి పైగా విద్యార్థులు మరణించడం దౌర్భాగ్యం
– తెలంగాణ భవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
– అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నాయకులు.
– ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి
హైదరాబాద్: అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. 2023 డిసెంబర్ 7వ నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 2024 ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ని బందీ చేసి పెట్టింది. 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మాణం చేశారన్న కోపంతో, ఆ మహానుభావుణ్ణి సంకెళ్లలో పెట్టి, ఎవరినీ వెళ్లనివ్వకుండా బంధించింది కాంగ్రెస్.
2025లో కూడా అదే అక్కసుతో, ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, కేసీఆర్ ఆనవాళ్లు అనే ఉద్దేశంతో మళ్ళీ బంధించి అవమానించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.అందుకే మొన్న విద్యార్థి విభాగం నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ మీరు గానీ ఈసారి బాబాసాహెబ్‌ను మళ్ళీ బందీ చేసి పెడితే, మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంకెళ్లు బద్దలు కొడతామని ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది.
బాబాసాహెబ్ చెప్పిన మాట: ‘బోధించు, సమీకరించు, పోరాడు’. కేసీఆర్ అదే ఆలోచనా విధానంతో లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించి, అడుగడుగునా పోరాడి చివరకు చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అనేది లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు.
కేసీఆర్ ప్రభుత్వం *1000 గురుకుల పాఠశాలలు* పెట్టింది. దాదాపు *6.5 లక్షల* మంది పిల్లలకు, సంవత్సరానికి ఒక్కొక్కరిపై *1.25 లక్షల రూపాయల* చొప్పున ఖర్చు చేస్తూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలని సంకల్పించింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని సరిగ్గా నిర్వహించలేకపోతోంది.
ఇవాళ ఆ గురుకులాల్లో మరణ మృదంగం మోగుతోంది. ఆహార కల్తీ వల్ల, ఆత్మహత్యల వల్ల 130 మందికి పైగా విద్యార్థులు మరణించడం దౌర్భాగ్యం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంబేద్కర్ ని రాజకీయ అవసరాల కోసం వాడుకుందే తప్ప గౌరవించలేదు. 1952, 1954లో ఆయన పార్లమెంటుకు రాకుండా కుట్రలు చేసి ఓడించింది కాంగ్రెస్.
హిందూ కోడ్ బిల్లు విషయంలో మహిళలకు హక్కులు కల్పించాలని ఆయన చూస్తే, దాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కాలంలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదు. కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం వచ్చినప్పుడే ఆయనకు ఆ గౌరవం దక్కింది. చివరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన ఫోటో పెట్టడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదు.
కేసీఆర్ దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇస్తే, తాము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్ కి ‘అంబేద్కర్ అభయహస్తం’ అని పేరు పెట్టారు. కానీ ఇవాళ దాన్ని అమలు చేయకుండా అటు దళితులను, ఇటు బాబాసాహెబ్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోంది. దళిత బంధు, రైతు బంధు లాంటి పథకాలు తేవాలంటే నాయకుడికి ‘కలేజా’ ఉండాలి, ఆ కలేజా ఉన్న నాయకుడు మా కేసీఆర్ గారు.
“నాడు కేసీఆర్ కంటే మరి దాన్ని మించిన పథకం మేము తెస్తామని చెప్పి ‘అంబేద్కర్ అభయహస్తం’ అని చెప్పి, చేవెళ్ళలో మల్లికార్జున ఖర్గే గాని పిలిచి SC, ST డిక్లరేషన్ అని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. SC, ST డిక్లరేషన్‌లో ఒక్కటే ఒకటి చెప్పలేదు. మా 12 లక్షలే కాదు ఇంకా చాలా చెప్పినారు. SCలకు 18 శాతం రిజర్వేషన్ చేస్తామన్నారు, ఇవాళ 16 ఉంది దాన్ని 18 చేస్తామన్నారు. STలకు 10 శాతం ఉన్న రిజర్వేషన్ పెంచుతాం, 12 శాతం చేస్తామన్నారు.
ఇవాళ దాదాపు రెండున్నర నెలలు గడిచినా మర్చిపోయారు. SC, STలకు ఇళ్లకు, మిగతా వర్గాలకు 5 లక్షలు ఇస్తే, SC, STలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటే ఇందిరమ్మ ఇంటికి 6 లక్షలు మీరు SC, ST అయితే అన్నారు. SC, STలకు జాగ లేకపోతే జాగ కూడా ప్రభుత్వమే ఇస్తదని చెప్పినారు.
అట్లాగే ఇంకొక్క మాట కూడా చెప్పారు SC, ST విద్యార్థులకు, BC విద్యార్థులకు – 10వ తరగతి పాస్ అయితే ₹10,000, 12వ తరగతి పాస్ అయితే ₹15,000, డిగ్రీ పాస్ అయితే ₹25,000, PG పాస్ అయితే ₹1,00,000, PhD చేస్తే ₹5,00,000 ఇస్తామని చెప్పి నమ్మబలికి, ఇంకా చాలా మాటలు చెప్పి SC, ST డిక్లరేషన్‌లో మోసం చేశారు. కాంట్రాక్టులు 42 శాతం ఇస్తామన్నారు BCలకు ప్రభుత్వ కాంట్రాక్టులలో. 18 శాతం ఇస్తామన్నారు SCలకు, STలకు 12 శాతం ఇస్తామన్నారు.
మొత్తం వెరసి 72 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు BC, SC, STలకే మేము అవకాశం ఇస్తామని చెప్పి ‘అభయహస్తం’ పేరిట మేనిఫెస్టో రాసి అందులో స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రెండున్నర నెలల కాలంలో దగ్గర దగ్గర లక్ష, లక్షన్నర కోట్ల కాంట్రాక్టులు పిలిచిండు రేవంత్ రెడ్డి. మరి వచ్చినయా BC, SC, STలకు 72 శాతం వాటా? రేపో మాపో మూసీ పిలుస్తారట, మూసీ కాంట్రాక్టులు ఇస్తాడా రేవంత్ రెడ్డి 72 శాతం వాటా?
ఆనాడు కేసీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట 20 లక్షల రూపాయలు మన పిల్లలకు ఇస్తే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట మైనారిటీ పిల్లలకు, మహాత్మా జ్యోతిబా పూలే పేరిట BC పిల్లలకు, స్వామి వివేకానంద పేరిట అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా కేసీఆర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి 7000 మంది పిల్లల్ని విదేశాల్లో విద్యకు పంపితే.. రేవంత్ రెడ్డి ఏమన్నాడు?
ఇదంతా తక్కువ, మేము వచ్చినాక ఇంకా ఎక్కువ చేస్తామన్నాడు. ఇవాళ ఆ పిల్లలకు ఒక్క రూపాయి ఇస్తలేడు, వాళ్ల విద్య మధ్యలోనే ఆగిపోయేలా అన్యాయం చేస్తున్నాడు. కాంగ్రెస్ చేసిన SC, ST డిక్లరేషన్ మోసాన్ని ప్రతి గిరిజన తండాకు, ప్రతి దళిత వాడకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, జగిత్యాలలో బహిరంగ సభ రెండు కార్యక్రమాల తర్వాత మే, జూన్ నెలల్లో ఎక్కడో ఒక దగ్గర SC, STల కోసం సభలు ప్రారంభిద్దాం.
కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యువజన డిక్లరేషన్, ఇక్కడ విద్యార్థి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్.. ఇలా ప్రతి దాని మీద కాంగ్రెస్ చేసిన ప్రామిస్‌ల మీద మనం పకడ్బందీగా పోరాడాలి.
కేసీఆర్ 125 ఫీట్ల విగ్రహం మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ పేరు మన సెక్రటేరియట్‌కు పెట్టారు. పార్లమెంట్ కొత్త భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.
అంబేద్కర్ అంటే కొందరివాడు కాదు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన నాయకుడు, అనగారిన వర్గాలకు గొంతు ఇచ్చిన నాయకుడు, మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన నాయకుడు, మన తెలంగాణకు రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించిన ఘనత కేసీఆర్
అంబేడ్కర్ మహాత్మా గాంధీ తో సమానంగా అందరి వాడు. జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదంతో ముందుకు పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎదుర్కొందాం.
మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు