Suryaa.co.in

Andhra Pradesh

మైలవరంలో పున:ప్రారంభమైన ప్రారంభమైన అన్న క్యాంటీన్

– టీడిపి ఆఫీస్ నుండీ ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి అన్న క్యాంటీన్ ను పున: ప్రారంభించటం జరిగింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ 2 రుపాయిలకే కిలో బియ్యం ఇచ్చి పేదలకు పట్టెడు అన్నం పెట్టారు. చంద్రబాబునాయుడు గారు 5 రూపాయిలకే అన్న క్యాంటీన్ ప్రారంభించి ఎంతో మంది ఆకలి తీర్చారు.వైఎస్సార్సీపీ వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ లను కూల్చివేసి పేదోళ్ళకు అన్నo పెట్టే అన్న క్యాంటీన్ తొలగించారు. ఇవాళ మళ్ళీ… మైలవరంలో ఎక్కడైతే అన్న క్యాంటీన్ పెట్టమో అక్కడే మళ్ళీ పున:ప్రారంబించటం జరిగింది. దాతలు, నాయకుల సహకారం తో అన్న క్యాంటీన్ నడుస్తుంది.

LEAVE A RESPONSE