Suryaa.co.in

Andhra Pradesh

ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్

అన్నా క్యాంటీన్ పరిశీలించిన పెమ్మసాని

‘ రూ. 20లు పెట్టినా కాఫీ, టీలు దొరకని ఈ రోజుల్లో కేవలం రూ. 5 లకే అన్నం పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇంత మంచి భోజనాన్ని ప్రజలకు అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మా ధన్యవాదాలు.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

గుంటూరులోని బస్టాండ్ సమీపంలో ఇటీవలే ప్రారంభించిన అన్న క్యాంటీన్ ను పెమ్మసాని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి సోమవారం పరిశీలించారు. అన్నా క్యాంటీన్ కు వచ్చిన ప్రజలకు దగ్గరుండి పెమ్మసాని వడ్డన చేశారు. అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడుతూ భోజనం ఏర్పాట్లు, రుచి, ఇతర సౌకర్యాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే ప్రజల మధ్యనే పెమ్మసాని అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. అనంతరం పెమ్మసాని విలేకరులతో మాట్లాడుతూ నిత్యం 350 మందికి ఒక్కో అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తున్న ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కిందన్నారు. అన్నా క్యాంటీన్ భోజనం తాను కూడా రుచి చూశానని, చాలా రుచిగా ఉందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. భోజనంతోపాటు చుట్టూ పరిసరాలు, మెనూ ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి అని తెలిపారు. అలాగే గుంటూరు జిల్లాలో పరిశ్రమల లేని రోజున ఒక చిన్న పరి కాంటినెంటల్ కాఫీ సంస్థను స్థాపించిన రాజేంద్ర ప్రసాద్ వంటి వ్యక్తుల సహకారం నేడు ఎంతో అవసరమని తెలిపారు. అలాంటి పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో మరిన్ని పరిశ్రమలు జిల్లాలో తీసుకురావచ్చని ఆయన ఈ సందర్భంగా వివరించారు. పరిశీలన అనంతరం పలువురు తెలుగు మహిళలు పెమ్మసానికి రాఖీ కట్టి, సోదర భావం చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్, కార్పొరేటర్ పోతురాజు సమత, టిడిపి నాయకులు సయ్యద్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE