చింతామణి నాటకం పునః ప్రదర్శనలకు కోర్టు ద్వారా అనుమతి తెచ్చిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు చిత్రపటానికి కళాకారులు పాలాభిషేకం చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మహాత్మాగాంధీ స్మృతివనంలో గాంధీ విగ్రహం ఎదుట రఘురామ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
దివిసీమ ప్రముఖ రంగస్థల కళాకారుడు, దర్శకుడు అడ్డాడ దుర్గా నాగేశ్వరరావు, ప్రముఖ పౌరాణిక కళాకారుడు బోలెం రామారావు, సాంఘిక నాటక నటుడు, నాటక రచయిత దాసి సీతారామరాజు, డప్పు కళాకారుడు శ్రీను, సిపిఐ అవనిగడ్డ నియోజకవర్గ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు, సిపిఐ జిల్లా నాయకుడు రావి బాబూరావు, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.