– బ్లాక్ స్టోన్ ₹4,500 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్: పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 150 మెగావాట్ల డేటా సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో బ్లాక్‌స్టోన్ లూమినా (బ్లాక్‌స్టోన్ యొక్క డేటా సెంటర్ విభాగం)తో పాటు జేసీకే ఇన్‌ఫ్రా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.ప్రతిపాదిత డేటా సెంటర్ ₹4,500 కోట్ల వరకు పెట్టుబడి పెడుతుంది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుంది.
బ్లాక్‌స్టోన్ లుమినా ప్రపంచంలోని ప్రముఖ క్లౌడ్ మౌలిక సదుపాయాల ప్రొవైడర్లలో కీలకంగా ఉంది. ఈ కంపెనీ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటంతో మిగతా విదేశీ కంపెనీలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానంగా మారనుంది.