– ఉదయం ఎండ.. మధ్యాహ్నం వాన.. రాత్రికి చలి
హైదరాబాద్: రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో గాలిలో తేమ శాతం పెరిగి అక్కడక్కడా క్యూమిలో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. మేఘాలు చల్లబడి గాలి దుమారంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గురువారం (ఏప్రిల్ 10) మధ్యాహ్నం నుంచి సాయంత్రం అంటే 3 గంటలన నుంచి 6 గంటల వరకు రైన్ అలెర్ట్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
అల్పపీడన ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా క్యుమిలో నింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చిరించారు. దీంతో ఈ జిల్లాల్లో వచ్చే మూడు గంటల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.