-హిందూ వ్యతిరేకత, భారతీయతా వ్యతిరేకత ఒక మానసిక రుగ్మత
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది- దేశం ప్రమాదంలో ఉంది- ప్రజాస్వామిక వాదులు ఆందోళనలో ఉన్నారు – రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి – భావ ప్రకటనా స్వేచ్ఛ లేదు- సెక్యూలరిజమ్ ప్రమాదంలో పడింది- మత సామరస్యానికి ముప్పు వచ్చింది- మైనారిటీలు ఆపదలో పడ్డారు- *మనుస్మృతి అమలులోకి వస్తుంది…
ఈ రకమైన పేలాపనలు, మానసిక అనారోగ్యపు వాంతులు మన దేశంలో జరుగుతున్నాయి. దేశ ప్రజలకు వికారంగా ఉంటోంది.
పత్రికల్లోనూ, సభల్లోనూ, మైకుల్లోనూ ఆందోళన జీవులు, మేధావులు, మందమతులు, మానసిక రోగులు, మతి పగిలిపోయినవాళ్లు, కామ్యూనిస్టులు, విదేశీ మత బానిసలు, ప్రజలకు పనికిరానివాళ్లు ఈ పేలాపనలు, వాంతులు చేస్తున్నారు. ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నా ఈ మూక తన తప్పు తెలుసుకోవడం లేదు. కక్కతోక వంకరలాగా ఈ మూక వక్రంగానే ప్రవర్తిస్తోంది.
కేంద్ర ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం. విదేశీ దుష్ట శక్తులకు అతీతంగా, అవినీతికి, చాతకాని పాలనకు, అభద్రతకు, దోపిడి దారులకు, వ్యతిరేకంగా ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నరేంద్రమోదీని కోరుకుని ప్రధానిగా ఎన్నుకున్నారు.
ఈ క్షేత్ర వాస్తవానికి విరుద్ధంగా ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడిందని పేలాపన చేయడం చెడ్డతనం. ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజను, ప్రజా తీర్పును అవమానిస్తున్నారు. వీళ్లకు కావాల్సింది స్వదేశ క్షేమం కాదు. వీళ్లకు కావాల్సింది విదేశీ విధ్వంసక భావజాలం, వీళ్లకు ఉన్నది విదేశీ మతోన్మాదం. వీళ్లు మానసిక బానిసలు; నపుంసకులు.
దేశం ఎప్పుడూ లేనంత భద్రతతో ఉంది. బీ.జెే.పీ. నరేంద్రమోదీ పాలనలో మనదేశం ఒక బలమైన శక్తిగా రూపొందింది. పంజాబ్, వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక వంటి రాష్టాల్లోని క్షేత్ర వాస్తవాలు, విదేశీ మతోన్మాదుల కుట్రలు వీళ్లకు అక్కర్లేదు.
ఈ దేశంలో ఎవరు ఆందోళనలో ఉన్నారు? ప్రజల తీర్పును గౌరవించని కుహనా ప్రజాస్వామికవాదులు పెద్ద శాతం ప్రజకు వ్యతిరేకంగా ఆందోళనలో ఉన్నారు! నిజానికి దేశానికి వీళ్ల వల్లే ఆపద పొంచి ఉంది.
రాజ్యాంగాన్ని రక్షించుకునే ప్రయత్నం ఎవరు చెయ్యాలి? ప్రజలు చెయ్యాలి. ఆ ప్రజలు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రక్షించుకునే, మార్పులు చేసుకునే బాధ్యత బీ.జే.పీ. కి ఇస్తున్నారు. ఇది క్షేత్ర వాస్తవం.
భావప్రకటనా స్వేచ్ఛ లేదా? ఇంత కన్నా పచ్చి అబద్ధం ఉండదు. దేశ ప్రధానిని, రాష్ట్రపతిని, గవర్నర్లని గత పదేళ్లలో అసంస్కారంగా దూషిస్తూ తమ వికృతాలను వెళ్లగక్కుతూ కూడా భావప్రకటనా స్వేచ్ఛ లేదు అనడం నీచత్వం. వెస్ట్ బెంగాల్లో, కేరళలో, తమిళ్ష్ నాడులో ముఖ్యమంత్రుల్ని విమర్శించి ఆ తరువాత భావప్రకటనా స్వేచ్ఛ లేదా, ఉందా అని తెలుసుకోవాలి ఈ మూర్ఖులు.
ఇప్పుడు సెక్యూలరిజమ్ ప్రమాదంలో పడడం ఏమిటి? 2014కు ముందు సెక్యూలరిజమ్ ప్రమాదంలో ఉండేది. ఇప్పుడు కాదు. 2014కు ముందు సెక్యూలరిజమ్ లేకపోబట్టే కదా విదేశీ మతోన్మాదానికి ఈ దేశంలోని పెద్దశాతం ప్రజలు దెబ్బతింటూ భయంతో బతికేవారు. సెక్యూలరిజమ్ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చి ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజలైన హిందువుల్ని అణిచెయ్యాలని ప్రయత్నించారు.
మత సామరస్యానికి ముప్పు కొత్తగా రాలేదు. అది దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే వచ్చింది. విదేశీ మత సంతుష్టీకరణ చేస్తూ హిందువుల్ని అణివేతకు గురి చేసిన చారిత్రిక సత్యం తెలుసుకుని ఇకనైనా మత సామరస్యం కోసం పని చెయ్యాలి.
మైనారిటీలు ఆపదలో పడ్డారా? హతవిధీ… ఇంతకు మించిన వంచన మరొకటి ఉండదు. చదువు ఉన్న వాళ్లకు కాదని చదువులేని వాళ్లకు సీట్లు ఉన్నట్టుగా, ప్రతిభ ఉన్న వాళ్లకు కాదని పనికిమాలిన వాళ్లకు ప్రమోషన్లు ఉన్నట్టుగా ఈ దేశంలో మైనారిటీలకు భద్రత చాల బలంగా ఉంది. మైనారిటీల భద్రత కోసం పెద్ద శాతం ప్రజలు బలౌతున్నారు.
మనుస్మృతి అమలులోకి వస్తుంది అనడం కన్నా వెర్రి మరొకటుండదు. ఏ మనుస్మృతి అమలులోకి వస్తుంది? అసలు ఏది మనుస్మృతి? మనుస్మృతి అంటే విలిఅమ్ జోన్స్ అల్లిన వక్రతా? స్వాతంత్రానికి ముందు ఇంగ్లిష్ పాలకులు, అంతకు ముందు ముస్లీమ్ పాలకులు మనుస్మృతి ప్రకారం పాలించారా? వెయ్యేళ్లుగా మన దేశంలో లేని మనుస్మృతిని మళ్లీ ఎవరో తెస్తారా? మనుస్మృతి అమలులోకి వస్తుంది అనడం వెర్రి పేలాపన.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది- దేశం ప్రమాదంలో ఉంది- ప్రజాస్వామిక వాదులు ఆందోళనలో ఉన్నారు – రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి – భావ ప్రకటనా స్వేచ్ఛ లేదు- సెక్యూలరిజమ్ ప్రమాదంలో పడింది- *మత సామరస్యానికి ముప్పు వచ్చింది- మైనారిటీలు ఆపదలో పడ్డారు- మనుస్మృతి అమలులోకి వస్తుంది… ఈ రకమైన పేలాపన ఒక విద్వేషవాదం; ఒక ఉన్మాదం; ఒక రాద్ధాంతం; ఒక మేధా వక్రత; ఒక మానసిక రోగం. దేశాన్ని దెబ్బకొట్టే ప్రయత్నంలో భాగం.
బీ.జే.పీ. కేంద్ర ప్రజాప్రభుత్వమై సమర్ధవంతంగా పనిచేస్తున్న కారణంగానూ, బీ.జే.పీ. ‘భారతీయత’ కల పార్టీ అవడం కారణంగానూ భారతీయతను, దేశ ప్రయోజనాలను, దేశంలోని పెద్దశాతం ప్రజలైన హిందువులను నాశనం చేసేందుకుగానూ విద్వేషంతో, ఉన్మాదంతో ఈ రాద్ధాంతం, ఈ వక్రత, జరుగుతోంది, పెరుగుతోంది. ఇక్కడ ఉన్మాదం తప్పితే వాస్తవాలు లేవు. ఇందులో సత్యం లేదు. ఇది భారతీయతా వ్యతిరేకత; ఇది హిందూ వ్యతిరేకత; ఇది దేశ వ్యతిరేకత; ఇది విధ్వంసక భావజాలం; ఇది విదేశీ మతోన్మాదం. ఇది గెలవదు!
‘హిందు వ్యతిరేకత, భారతీయతా వ్యతిరేకత ఒక మానసిక రుగ్మతగా ప్రపంచ చరిత్రలో నమోదు కానుంది’. భారతదేశంలో భారతీయతా వ్యతిరేకత అన్న వికృతమైన రోగం ఉండేదని భవిష్యత్తులో ప్రపంచ ప్రజలు చరిత్ర ద్వారా తెలుసుకుంటారు. ఈ మానసిక రోగులు, దేశ విరోధులు, ప్రజా వ్యతిరేక దుష్ట శక్తులు ఇకనైనా మారితే మంచిదే. వాళ్లు మామూలు మనుషులైతే వాళ్లూ సరైన దేశ పౌరులు అవచ్చు. అలా కాకపోతే మామూలు పౌరులచే విసర్జించబడి మురుగు లేదా మలంగా అసహ్యించుకోబడతారు.
ఈ దేశంలోని పెద్దశాతం ప్రజకు భద్రత కావాలి; బతుకు కావాలి. దేశానికి అభివృద్ధి కావాలి. అందుకు ‘భారతీయత’ కావాలి. తనను తాను రక్షించుకునేందుకు, తనను తాను దక్కించుకునేందుకు ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజ సిద్ధమైంది.
విదేశీ మతోన్మాద, ప్రజా విద్వేషవాద, విధ్వంసక భావజాల కుట్రలకు, రాద్ధాంతాలకు, వక్రతకు వ్యతిరేకంగా దేశ ప్రజ సమష్టిగా పోరాడి గెలవాలి; ఈ దేశ ప్రజ గెలుస్తుంది; భారతదేశం గెలుస్తుంది; భారతీయత గెలుస్తుంది!
తథాస్తు.

9444012279