ఎందుకీ రాజకీయధానులు!?

సువిశాల భారతావనికి
ఒకటే రాజధాని..
జానాబెత్తెడు
ఆంధ్రప్రదేశ్ కు మూడు..
దేశానికి ఆర్థిక రాజధాని
నాడు నేడు ముంబై..
అమరావతికి అప్పుడే చెప్పేస్తారా బైబై..
దేశరాజధాని
మొదట్నుంచీ ఢిల్లీ
అమరావతిని అనతికాలంలోనే
మార్చాలనుకోడం
కాదా సిల్లీ..
కర్ణాటకకు..బెంగాలుకు మారినా రాజధాని పేరులు
ఇప్పటికీ అవే ఊరులు..
చెన్నపట్నం మదరాసై..చెన్నైగా మారినా
తమిళ రాజధాని
తీరు మారెనా..?
విడిపోయినా తెలంగాణ
హైదరాబాదుకే కదా జిందాబాద్..
ఒడిశాలో పట్నాయకులు
ఎందరు కుర్చీ ఎక్కినా రాజధానిని మార్చి
ఏ పట్నాయకూ కాలేదే ఖల్నాయక్..
గుజరాత్ రాజధాని గాంధీనగరే గాని మోడీనగర్ పుట్టుకురాలేదే..
లాలూ మేసి
ఉండొచ్చు పశుగ్రాసం
కానీ పాట్నాకు
చేయలేదే మోసం..
జపాన్ రాజధాని సుందరనగరం టోక్యో
మార్చలేదు ఏ సైకో..
అమ్మ కడుపు..స్మశానం
మానవ జీవితంలో రెండే రాజధానులు
మరి మనకెందుకు
ఈ మూడు రాజకీయధానులు..!?

– ఇ.సురేష్ కుమార్
9948546286

Leave a Reply