హోం శాఖ మంత్రి తానేటి వనితను కలిసిన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

0
75

అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనితను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వనితకు డీజీపీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాక్‌లో హోంమంత్రితో అడిషనల్ డీజీ రవిశంకర్, ఐజీ ప్లానింగ్ నాగేంద్రబాబు, అండ్ ఆర్డర్ డిఐజీ రాజశేఖర బాబు, ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు, ఐజీ ట్రైనింగ్ వెంకటరామి రెడ్డి, గుంటూరు ఎస్పీ అరిఫ్ అహ్మద్, ఇతర అధికారులు సమావేశమయ్యారు. పోలీసు శాఖలోని వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో హోంమంత్రి తానేటి వనిత చర్చించారు.