– పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం నాడు ఢిల్లీ పర్యటించారు. ఆ వివరాలివి. కేంద్ర కన్సూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కందిపప్పు కేటాయింపులు చేయాలని, ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కవరేజీ కాకుండా లబ్దిదారుల కవరేజీని మరింత పెంచాల్సిందిగా, రాష్ట్రంలో మరో 8 ప్రెస్ రిపోర్టింగ్ కేంద్రాలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
అలాగే, రాష్ట్రంలో ధరల స్థిరీకరణకు రూ.532 కోట్ల ధరల స్థిరీకరణ నిధులను కేటాయించాల్సిందిగా, రాష్ట్రానికి రావాల్సిన రూ.1187 కోట్ల పెండింగ్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని, రాష్ట్రంలో 11 సిలో గోడౌన్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా పైన పేర్కొన్న అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఈ అంశాలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
మనోహర్‌తో కాకినాడ, ఏలూరు ఎంపీలు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్, రాష్ట్ర కన్సూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు పాల్గొన్నారు.