• నైతిక రుజువర్తన.. చేసే పనుల్లో పారదర్శకత చాలా ముఖ్యమని ఏపీడీసీ గ్రహించాలి
• ప్రభుత్వసంస్థగా ఉంటూ ఒక పార్టీ కోసం పనిచేస్తున్న ఏపీడీసీ తీరుని తామే కాదు ప్రజలు కూడా హర్హించరు
• ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఏపీడీసీ తమముందు ఉంచిన సమాచారమంతా ఫేక్ చెక్ అని తేలిపోయింది
• ముఖ్యమంత్రి వేరు.. ప్రభుత్వం వేరనే వాస్తవాన్ని ఏపీడీసీ తెలుసుకోవాలి
• మాకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా కంటెంట్ కార్పొరేషన్ ద్వారా గూగుల్ కు, ఇతర ప్రైవేట్ వెబ్ సైట్స్ కు ఎలాంటి యాడ్స్ ఇవ్వలేదు
• ఏపీడీసీ వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉంటే రెండున్నరేళ్లుగా కాగ్ కు ఎందుకు అకౌంట్స్ సమర్పించడం లేదు?
– టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ప్రకటనలకు సంబంధించి నీలి మీడియా సాక్షి వెల్లడించిన సమాచారం ఫ్యాక్ట్ చెక్ కాదని..అదంతా ఫేక్ చెక్ అని, వైసీపీ సోషల్ మీడియా సిబ్బం ది దాదాపు 120 మందికి పైగా డిజిటల్ కార్పొరేషన్లో ఉన్నారనే దానిపై జగన్ అవినీతి మీడియా ఎందుకు స్పందించలేదని, ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ తమకింద పనిచేసే సిబ్బందిని ఎలా పడితే అలా నియమించుకోవచ్చనేదే ప్రభుత్వం, జగన్ మీడియా ఉద్దేశమా అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ కేవలం ముఖ్యమంత్రి ఇమేజ్ పెంపుదలే తమ లక్ష్యమన్నట్టు ఏపీ డిజిటల్ కార్పొ రేషన్ (ఏపీడీసీ) పనిచేస్తోందని తాము గతంలోనే చెప్పాం. ఇప్పుడూ అదే చెబుతు న్నాం. ఐ ప్యాక్ విభాగానికి తాము ఎలాంటి ప్రకటనలు ఇవ్వడంలేదని, నాలుగేళ్లలో తాము రూ.88.56కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని, రూ.500కోట్లు ఖర్చుపెట్టామనడం అవాస్తవమని ఏపీడీసీ వివరణ ఇచ్చింది. అలానే ప్రభుత్వాధినేత అయిన ముఖ్య మంత్రి ఫోటోలు తాము చూపించడం తప్పెలా అవుతుందని కూడా సదరు విభాగం సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
వైసీపీ సోషల్ మీడియాలోని సిబ్బందే డిజిటల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. ఒకవైపు పార్టీ కోసం.. మరోపక్క ప్రభుత్వసంస్థలో ఒకేరకమైన వ్యక్తులు పనిచేయడం ఎంతవరకు సరైందో, దాన్ని సాక్షిమీడియా, ప్రభుత్వ పెద్దలు ఎలా సమర్థించుకుంటారో స్పష్టం చేయాలి. ఏపీడీసీలో పనిచేసే ఉద్యో గుల పేర్లు, ఇతర వివరాలను తాము వెల్లడిస్తే, వారిగురించి సదరు విభాగం ఫ్యాక్ట్ చెక్ పేరుతో వెల్లడించిన సమాచారంలో ఎందుకు చెప్పలేదు? అలానే ముఖ్యమంత్రి అంటేనే ప్రభుత్వమన్నట్టుగా, ఆయన ఫోటోలు, వీడియోలు తాము ప్రజలు, ప్రసార మాధ్యమాలకు చూపడం తప్పుకాదని ఏపీడీసీ తన చర్యల్ని సమర్థించుకోవడం సరైం ది కాదు.
ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కాదనే వాస్తవాన్ని ఒక ప్రభుత్వ సంస్థ గుర్తించలేకపోవడం నిజంగా బాధాకరం. కేవలం ముఖ్యమంత్రి ప్రచారం కోసం ప్రజలసొ మ్ముని దుర్వినియోగం చేస్తాం..మా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తామనే ఏపీడీసీ వాదన ఎంత మాత్రం సహేతుకం కాదు. అలా ప్రవర్తించే ఏపీడీసీని నిలదీయడం ప్రతిప క్షంగా మా కున్న హక్కు. అలానే ప్రధానప్రతిపక్షం తరుపున మేం ప్రభుత్వమిచ్చిన జీవోల యొక్క చట్టబద్ధతనే ప్రశ్నిస్తున్నామనే విషయాన్ని ఏపీడీసీ గ్రహించాలి. ఏపీ డీసీ ఇంటిగ్రిటీని.. నిజాయితీని.. పరిపక్వతతో కూడిన ఆలోచనల్నే తాము ప్రశ్నిస్తు న్నాం.
ఏపీడీసీకి ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులు నిజమా.. ఏపీడీసీ చెబుతున్న లెక్కలు నిజమా?
ప్రతి ఏటా బడ్జెట్లో ఏపీడీసీకి రూ.100కోట్లు కేటాయిస్తున్నట్టు అసెంబ్లీలో ఆర్థిక మంత్రే చెప్పుకొచ్చారు. అలానే ఆయన చేసిన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రచురించినప్పుడు కూడా సాక్షి పత్రిక అదే విధంగా చెప్పింది. ఆర్థిక మంత్రి చెప్పింది. .సాక్షి దినపత్రికలో వచ్చింది తప్పా..లేక ఏపీడీసీ చెబుతున్నది తప్పా? ప్రభుత్వం నాలుగేళ్లలో బడ్జెట్లో కేటాయించిన సొమ్ము రూ.400కోట్లు అయితే, ఏపీడీసీ నాలుగేళ్లలో కేవలం రూ.88.56 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టినట్టు చెప్పడం ఎంతవరకు నిజం?
అదే నిజమైతే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన విధంగా కార్పొరేషన్ కు నిధులు కేటాయించలేదా? నాలుగేళ్లలో ప్రభుత్వం కేవలం రూ.88 కోట్లు మాత్రమే కేటాయించిందా? 20-07-2021న జగన్ ప్రభుత్వమిచ్చిన జీవోలో (జీవో ఆర్.టీ నెం-43) మాత్రం ఏపీడీసీ సిబ్బంది జీతాలు.. కార్పొరేషన్ భవనానికి అద్దెలు.. ఇతరత్రా ఖర్చులు రోజువారీ అవసరాల కోసం రూ.24.50 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఆ మొత్తాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కేటాయించినట్టు కూడా చెప్పారు.
ఆ లెక్కన 2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 13 నుంచి 14 త్రైమాసికాలు ముగిస్తే, వాటిలో ఎన్ని త్రైమాసికాలకు రాష్ట్రప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది.. వాటిలో ఏపీడీసీ ఎంత ఖర్చుపెట్టింది? ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారంతో పాటు. తమకు దొరికిన సమాచారాన్ని బట్టే, రూ.500 కోట్లుఅని చెప్పాం. ఏపీడీసీ సంవత్సరానికి తాము కేవలం రూ.22కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామంటుంటే, ప్రభుత్వమేమో కేవలం ఒక త్రైమాసికానికే రూ.24.50 కోట్లు కేటాయించామని చెబుతోంది. ప్రభుత్వజీవోలు నిజమా.. ఏపీడీసీ వాదన నిజమా? ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేసే జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచితే, ఎక్కడా ఎవరినీ అనుమానించాల్సిన పరిస్థితి రాదు.
ఏపీడీసీ ఉద్యోగులుగా చెప్పబడేవారంతా ఆ విభాగంలోనే పనిచేస్తున్నారా..లేక ఎక్కడో పనిచేస్తూ డిజిటల్ కార్పొరేషన్లో జీతాలు తీసుకుంటున్నారా?
డిజిటల్ కార్పొరేషన్లో దాదాపు 120కి పైగా ఉద్యోగులు, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తో సహా ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. వారి జీతభత్యాలు.. ఇతరత్రా నిర్వహణ ఖర్చులు.. గూగుల్ తో పాటు, ఇతర సంస్థలకు యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చే యాడ్స్ కు కలిపి నిజంగా ఏపీడీసీ విభాగం సంవత్సరానికి కేవలం రూ. 22కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందా?
అవన్నీ లెక్కలేసే కదా ప్రభుత్వం జీవో ద్వారా మొదటి త్రైమాసికంలో రూ.24.50 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పింది. అసలు 120కి పైగా ఉద్యోగులు.. ఏపీడీసీ కార్యాల యంలోనే పనిచేస్తున్నారా..లేక ఎక్కడో చేస్తూ, ఇక్కడ జీతాలు తీసుకుంటున్నారా? తాము చెప్పినట్టు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తూ..ఏపీడీసీ ఉద్యోగులుగా చెలా మణి అవుతున్నారా? ఏపీడీసీ తమ కార్యకలాపాల కోసం చేసినట్టు చెబుతున్న ఖర్చులు…అందుకు ప్రభుత్వం చేసిన కేటాయింపులు.. కాగ్ నివేదికలోని అంశాలకు ఎక్కడా పొంతన కుదరడంలేదు.
ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఈ నాలుగేళ్లలో చివరిగా 2019-20 సంవత్సరానికి సంబంధించిన అకౌంట్స్ వివరాలు మాత్రమే వెల్లడించినట్టు కాగ్ చెబుతోంది. 2020-21, 2021-22 సంవత్సరాల అకౌంట్స్ ఇంకా ఫైనలైజ్ చేయ లేదని కూడా చెప్పింది. రెండున్నరేళ్లుగా ఏపీడీసీ కాగ్ కు ఎందుకు అకౌంట్స్ వివరాలు వెల్లడించలేదో సదరు విభాగం తక్షణం సమాధానం చెప్పాలి.
నెట్ ప్రాఫిట్ మైనస్ లో ఉన్నట్టు చెబుతున్న సంస్థ, లాభాలు వస్తున్నాయని చెప్పడం హాస్యాస్పదం
అలానే ఏపీడీసీకి ఎలాంటి ఆదాయం లేదని ఖర్చుమాత్రమే ఉందని తాము చెప్పిన దానిపై సదరు విభాగం తమకు సంపాదన కూడా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. అదే నిజ మైతే ఆ సంపాదన అకౌంట్స్ వివరాలు ఎందుకు బహిర్గతం చేయడంలేదు? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 29-11-2018న మాత్రమే సంపాదన వివరాలు ఏపీడీసీ వెల్లడించింది.
వైసీపీప్రభుత్వం వచ్చాక ఇన్నేళ్లలో 2019-20 మాత్రమే తూతూమం త్రంగా కొన్నివివరాలు వెల్లడించిన ఏపీడీసీ, 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించిన సంపాదన అకౌంట్స్ వివరాలు ఎందుకు బయటపెట్టలేదు? నష్టాలు లేవు.. లాభాల్లో ఉన్నామని చెబుతున్న ఏపీడీసీ గతంలో తన నెట్ ప్రాఫిట్ (మైనస్) -1.19 లో ఉన్నట్టు ఎలా చెప్పింది?
తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కంటెంట్ కార్పొరేషన్ ద్వారా యాడ్స్ ఇచ్చారు కదా.. అప్పుడు అది తప్పుకాకపోతే ఇప్పుడు తప్పెలా అవుతుందని కూడా ఏపీడీసీ వాదిస్తోంది. మాకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో ఎప్పుడూ కూడా కంటెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి గూగుల్ యాడ్స్ ఇవ్వలేదు. అలానే ప్రైవేట్ వెబ్ సైట్స్ కు కూడా యాడ్స్ ఇవ్వలేదు.
యాడ్సే ఇవ్వనప్పుడు ఇక చెల్లింపు లు జరిగే ప్రస్తావనే లేదు. ఐ ప్యాక్ కు తాము ఎలాంటి ప్రకటనలు ఇవ్వడంలేదని కూడా ఏపీడీసీ చెప్తోంది… అదే నిజమైతే ఏపీడీసీ గూగుల్ కు ఇచ్చే ప్రకటనలు.. ఐప్యాక్ ఇచ్చే ప్రకటనలు ఒకేలా ఎందుకుంటున్నాయి? వాటిలోని కంటెంట్ కూడా ఒకేమాదిరి ఉండటమేంటి? రెండు విభాగాల యాడ్స్ ఒకేలా ఉన్నాయని మాత్రమే మేం గతంలోచెప్పాం..ఇప్పుడూ అదే చెబుతున్నాం. మేం రేట్ కార్స్ట్ పాటించాము..ఎంపానెల్మెంట్ కోసం బహిరంగ ప్రకటనలు ఇచ్చాం.. కనీసం 5 కంటే ఎక్కువ సంస్థలకు ప్రచార ప్రకటనలు ఇచ్చినట్టు కూడా ఏపీడీసీ వాదించింది.
రేట్ కార్ట్స్ గురించి తాము చెప్పలేదు. మేం పదులకొద్దీ వెబ్ సైట్స్ కు ప్రకటనలు ఇచ్చారనే చెప్పాం. 5 కు పైగా సంస్థలకు యాడ్స్ ఇచ్చామని ఏపీడీసీనే చెబుతోంది. అదే కదా మేం చెప్పింది కూడా? పదులకొద్దీ సంస్థలకు ప్రభుత్వసొమ్ము చెల్లించి ప్రకట నలు ఇచ్చారనేది నిజమే. కాకపోతే అలా ఇవ్వడం అవసరమా అనేదే తమ సందేహం ? ప్రతిపక్షంగా తమ అభిప్రాయాలు, సందేహాలు వెల్లడించాం.
సాక్షి సిబ్బందిని ఏపీడీసీ ఉద్యోగులుగా తీసుకున్నారని మేం చెప్పలేదు.. అలా వచ్చినట్టు ఇప్పుడు ఏపీడీసీనే ఒప్పుకుంది. సాక్షి సంస్థ నుంచి ఎవరెవరిని, ఏ అర్హత ల ప్రాతిపదికన తీసుకున్నారో.. వారికి ఎంతెంత జీతాలు చెల్లిస్తున్నారో ఏపీడీసీ పూర్తి వివరాలు బయటపెట్టాలి. కొద్దిమంది డిజిటల్ కార్పొరేషన్లో.. I&PRలో జీతాలు తీసు కుంటూ సాక్షిలో పనిచేస్తున్నారని చెప్పాం. దానిపై కూడా ఏపీడీసీ స్పష్టత ఇవ్వాలి.
ఏపీడీసీ విభాగం తమ ముందు 22 పాయింట్లు పెట్టి.. తనను తాను కాపాడుకునే ప్రయత్న చేసింది. ఆ పాయింట్లు అన్నింటికీ తాము సమాధానంచెప్పాం. ఇంకా కావా లంటే చెబుతాం. ఈ మొత్తం వ్యవహారంలో మేం చెప్పేది ఏమిటంటే ప్రభుత్వ కార్యక్రమా ల ముసుగులో అత్యధికంగా యాడ్స్ ని వివిధ మాధ్యమాలకు ఇష్టానుసారం ఇవ్వడం సరైన పద్ధతికాదని.
అలాఇచ్చే ప్రకటనలు ఒక డిస్గస్డ్ అడ్వైర్జ్ మెంట్ కిందకు వస్తాయ నేదే మా అభిప్రాయం. నైతిక రుజువర్తన.. చేసే పనిలో పారదర్శకత అనేది ప్రభుత్వం లోని వారికి.. ప్రభుత్వ విభాగాలకు తప్పనిసరి. ఈ వాస్తవాన్ని ఏపీడీసీ గ్రహిస్తే మంచి ది. అలాంటి నైతిక రుజువర్తన అనేది ఏపీడీసీ కార్యకలాపాల్లో లోపించింది. ఒక ప్రభుత్వ కార్పొరేషన్ .. ఒక పార్టీ పబ్లిసిటీ వింగ్ గా పనిచేయడం ఎంతమాత్రం సరైన విధానం కాదు” అని విజయ్ కుమార్ తేల్చిచెప్పారు.