దేవుళ్లంతా బ్రాహ్మణులే.ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసింది బ్రాహ్మణులే. మనుషులను విభజించింది బ్రాహ్మణులే. మనువాదం పేరుతో మనుషులలో విభజన తీసుకువచ్చింది బ్రాహ్మణులే. ఇలాంటి వాదనలు కొన్ని శతాబ్దాలుగా వినిపిస్తూనే ఉంటాయి. నిజంగా హిందువులు పూజించే దేవుళ్లు, దేవతలంతా బ్రాహ్మణులేనా? మిగిలిన కులాలకు దేవుళ్లు ఎందుకు లేరు? దళిత, బీసీ కులాలకు దేవుళ్లెందుకు ఉండరు?అన్ని గుళ్లలో బ్రాహ్మణులే పూజారులుగా ఎందుకు ఉంటారు? ఇలాంటి అనుమానాలు- అపవాదులు మేధావుల నోటి నుంచి వింటూనే ఉన్నాం. అసలు నిజాలేమిటో చూద్దాం రండి. దేవుళ్లలో బ్రాహ్మణులు ఉన్నారో లేదో చూద్దాం రండి.
మతం మారితే కష్టాలు పోతాయి. వివక్ష పోతుంది. అనుకుంటే మనిషి రోజుకొక మతం మారాల్సి వస్తుంది. హక్కులు పోరాడి సాధించుకోవాలి. అంతే కాని పారిపోయి కాదు.కేవలం పిరికి పందలే పారిపోతారు. ఇక హిందూ దేవుళ్ళు అంతా బ్రాహ్మణులే… పూజారులు కేవలం బ్రాహ్మణులే ఉంటారు అనుకునే అజ్ఞానుల కోసం….. పార్వతీ పరమేశ్వర వినాయక కుమారస్వామి మొదలైన ఆరాధ్య దైవాలు బ్రాహ్మణులు కారు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ జాంబవాది దేవుళ్లు బ్రాహ్మణులు కాదు. బలరామ శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ జాంబవతి పాండవ కౌరవాదులు బ్రాహ్మణులు కాదు. నిత్యం పూజలందుకునే మత్స్య కూర్మ వరాహ నరసింహాది దశావతారాలు బ్రాహ్మణులు కాదు అసలు నరులేకారు. రామాయణం వ్రాసిన వాల్మీకి బ్రాహ్మణుడు కాదు. మహాభారతం వ్రాసిన వేదవ్యాసుడు బ్రాహ్మణుడు కాదు. వేదాల విభజన చేసిన వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు.
ఇక గ్రామ దేవతలు ఆ దేవాలయాల పూజారులు ఎవ్వరూ బ్రాహ్మణులు కాదు
మార్కండేయ గుడి పూజారులు బృగుబ్రాహ్మణులైన పద్మశాలిలు.
వీరబ్రహ్మేంద్రస్వామి గుడి పూజారులైన విశ్వకర్మలు.
కాటమయ్య గుడి పూజారులు గౌడులు.
వనం ఎల్లమ్మతల్లి గుడి పూజారులు గౌడ్ లు.
వనం మైసమ్మ తల్లి పూజారులు గౌడ్ లు.
భీరప్ప గుడి పూజారులు కురువలు.
మల్లన్న గుడి పూజారులు గొల్లలు.
లింగమయ్య గుడి పూజారులు గొల్లలు.
మంత్రాలమ్మ గుడి పూజారులు గొల్లలు.
మారెమ్మ గుడి పూజారులు మాదిగలు.
ఈర నాగమ్మ గుడి పూజారులు మాదిగలు.
చెన్నకేశవులు గుడి పూజారులు మాలలు.
నాంచారమ్మ గుడి పూజారులు ఎరుకలు.
బాలమ్మ గుడి పూజారులు ఎరుకలు.
జమ్ములమ్మ గుడి పూజారులు ఎరుకలు.
ఏకలవ్య గుడి పూజారులు ఎరుకలు.
కోటమైసమ్మ గుడి పూజారులు వడ్డెర దేవర
పోశవ్వ గుడి పూజారులు కుమ్మరి
బొడ్రాయి గుడి పూజారులు బైండ్లు
ఈర నాగమ్మ గుడి పూజారులు బైండ్లు
బాపనింటి ఎల్లమ్మ గుడి పూజారులు బైండ్లు
మడేల్ గుడి పూజారులు చాకలి
ఈర నాగమ్మ గుడి పూజారులు చాకలి
రేణుక ఎల్లమ్మ గుడి పూజారులు గొల్ల ముష్టొలు.
పోలేరమ్మ గుడి పూజారులు దేవర
జాంబవంతుడు గుడి పూజారులు చిందొలు.
గండిమైసమ్మ గుడి పూజారులు తెలుగోళ్లు
గంగమ్మ గుడి పూజారులు గంగపుత్రులు.
లింగమయ్య గుడి పూజారులు చెంచులు.
సమ్మక్క సారక్క గుడి పూజారులు కోయలు.
రావణాశు రుడి గుడి పూజారులు గోండులు.
తుల్జాభవాని గుడి పూజారులు లంబాడాలు.
సేవాలాల్ గుడి పూజారులు లంబాడాలు.
లుంగిడియా గుడి పూజారులు లంబాడాలు.
సీట్లా భవాని గుడి పూజారులు లంబాడాలు.
మేరామా భవాని గుడి పూజారులు లంబాడాలు.
ఈదమ్మ గుడి పూజారులు వడ్డెరలు
బాలనాగమ్మ గుడి పూజారులు వడ్డెరలు
ముత్యాలమ్మ గుడి పూజారులు గౌడ్ లు
ముత్యాలమ్మ గుడి పూజారులు బార్కెవాళ్ళు
మ్యాతరమ్మ గుడి పూజారులు మేదర
భూలచ్చువమ్మ గుడి పూజారులు బోయలు.
ఎల్లమ్మ గుడి పూజారులు బోయలు
ఇడుపు దేవర గుడి పూజారులు బోయలు.
శతాబ్దాలుగా ప్రపంచమంతా.. కాలికి చెప్పులేసుకుని తిరుగుతున్న ఈ అబద్ధాల్లో ,నిజమెంతో చెప్పడమే నా ఈ వ్యాసం లక్ష్యం. మరో కారణం.. చరిత్ర చదవకుండా చెప్పుడు మాటలు విని, నీ బిడ్డలకు తప్పులు చెప్తే, రేపు నీ బిడ్డలు నిజాలు తెలుసుకుంటే.. మా నాన్న ఇంత సొల్లుగాడా అని చూసే ఆ చూపు, మీకే భరించలేని విధంగా ఉంటుంది. ఎవరి ట్రాప్ లో పడకుండా మన దళిత గిరిజన బహుజన OC BC SC ST హిందూ సిక్కు జైన్ యూదు పార్షి సోదరులు జాగ్రత్తగా ఉండాలి.
హిందూ అన్న పేరు వింటే.. తిన్నది అరగకుండా పిచ్చి గంతులు వేసే..(మతమార్పిడిలు ప్రోత్సహించే) దేశద్రోహుల కు ఇది అంకితం
(సేకరణ: వరహాల బాబు)
– పావని రెడ్డి