– మూడు రాజధానులు అంశాన్ని రెఫరెండంగా తీసుకొని రాజీనామాలు చేసి ఎన్నికలకు సిద్ధమా?
– అంత దమ్ము వైసిపి నాయకులకు ఉందా?
– మంత్రి గుడివాడ అమర్నాథ్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ సవాల్
విశాఖలో చంద్రబాబుని అడ్డుకుంది ఉత్తరాంధ్ర ప్రజలు కాదు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వైసిపి పెయిడ్ ఆర్టిస్టులు.మూడు రాజధానులు పేరు చెప్పి ఈ మూడు సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రజలకు వైసిపి ఏం చేసిందో సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక రైల్వేజోన్ మరిచిన మీరా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడేది.?
ఉత్తరాంధ్ర లో భూములు ,నిధులు ,గనులు దోపిడీ చేసి ఉత్తరాంధ్ర ప్రజలను దోచుకుంటున్న పార్టీ వైసీపీ కాదా?ఉత్తరాంధ్ర అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఎందుకు ప్రతిఘటించలేదు?
25 సీట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి అల్లావుద్దీన్ అద్భుతదీపం చూపిస్తానని చెప్పి కేసుల మాఫీ కోసం కేంద్రానికి దాసోహమై ప్రజలను నిలువునా ముంచిన పార్టీ వైసీపీ కాదాఉత్తరాంధ్రలో నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మంత్రి అమర్నాథ్ కి ఉందా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కారా?
విశాఖ రాజధాని అని చెప్పి విలువైన భూములను కాజేసిన చరిత్ర మీ పార్టీది కాదా? 3 రాజధానుల పేరుతో వైసీపీ పెద్దలు గద్దల్లా వనరులను, భూములను దోపిడీ చేసిన విషయాలలో చర్చకు సిద్ధమా?ఉత్తరాంధ్రలో విలువైన భూములు దోచుకున్న దానిపై వేసిన సిట్ నివేదికను బహిర్గతం ఎందుకు చేయలేదు?
ఉత్తరాంధ్ర ప్రజలు హక్కులను కాపాడలేని వ్యక్తి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధి అని చెప్పుకునే అర్హత మీకు లేదు.అమర్నాథ్ మీ రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు బిక్ష. ఇప్పటికే చంద్రబాబు పై ప్రెస్మీట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్నావు.
వ్యక్తిగత హోదా కోసమే మంత్రి పదవిని ఉపయోగించుకుంటున్న మీరు ఇకనైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పని చేస్తే అందరూ సంతోషిస్తారు. వైసిపి పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి శూన్యం.చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు ఉత్తరాంధ్ర పేరు చెప్పి మంత్రిపదవి అనుభవిస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నావు. ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేసిన వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.