Suryaa.co.in

Andhra Pradesh

నిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు

విజయవాడ: వరద బాధితులకు ఏవిధంగా ప్రభుత్వం సహాయం అందించాలన్న దానిపై ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీపై మంత్రుల బృందం చర్చించింది.

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చం నాయుడు,గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లతో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి గురువారం విజయవాడ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

బాధితులకు సహాయం అందించటంలో రెవిన్యూ, మున్సిపల్,గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. ఏ ఏ వార్డులలో ఎంతమంది భాధితులు ఉన్నారో వారి ఇళ్ల వద్దకే సహాయం అందించాలని స్పష్టం చేసింది.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు,సియం కార్యదర్శి ప్రద్యుమ్న,ఎన్టీఆర్ జిల్లా కలక్టర్ జి.సృజన, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని,శాసన సభ్యులు బోండా ఉమా మహేశ్వర రావు,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE