– ఇంటెలిజెంట్ ఇండస్ట్రీ ప్రయోజనాలు అన్నివర్గాలకు చెందాలి
– ఆంధ్రప్రదేశ్ లో మూడు నాలెడ్జి సిటీలు ఏర్పాటు చేయబోతున్నాం
– వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్
దావోస్: ప్రపంచవ్యాప్తంగా 26శాతం గ్లోబల్ కంపెనీలు తమ ఉత్పాదకతను పెంపొందించుకోవడం, నూతన ఆవిష్కరణల కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగిస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. “బిల్డింగ్ ద ఎకో సిస్టమ్ ఫర్ ఇంటెలిజెంట్ ఇండస్ట్రీస్ అనే అంశంపై దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో నిర్వహించిన సదస్సుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
ఈ సదస్సులో భారత పరిశ్రమల ప్రోత్సహక, వాణిజ్య శాఖ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా, జిఎంఆర్ ఇన్ ఫ్రా కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్, జిఎస్ఎంఎ (యుకె) డైరక్టర్ జనరల్ వివేక్ బద్రీనాథ్, రోబస్ట్ ఎఐ సిఇఓ ఆంటోనీ జూలెస్, పెప్సికో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అథినా కనౌరియా, ఆగరి (యుఎస్ఎ) సిఇఓ సార్ యోస్కోవిట్జ్ హాజరయ్యారు. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… కేవలం ఎఫిషియన్సీని పెంచుకోవడానికి మాత్రమే కాకుండా సామాజిక ప్రయోజనాలు, అసమానతలు తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులను పసిగట్టడం వంటి రంగాల్లో కూడా ఎఐ ఇంటిగ్రేషన్ జరగాలి.
ఇంటిలిజెంట్ ఇండస్ట్రీలో ఎఐ వినియోగం ద్వారా అంతర్జాతీతంగా ఉత్పాదకతపరంగా $6.6 ట్రిలియన్లు, వినియోగదారుల నుంచి $9.1 ట్రిలియన్లు ఆదాయ వృద్ధి జరుగుతుందని అంచనాగా ఉంది. ఇది స్థిరమైన, సమ్మిళిత వృద్ధి దిశగా పరిశ్రమలను నడిపించడంలో నాయకత్వ అవసరాన్ని స్పష్టంచేస్తోంది. ఇంటిలిజెంట్ ఇండస్ట్రీ పురోగతిలో వాటాదారులందరికీ ప్రయోజనం చేకూర్చేలా ప్రైవేటు, ప్రభుత్వరంగాలు, విద్యాసంస్థలు, పౌరసమాజాలకు భాగస్వామ్యం కల్పించాలి.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మార్కెట్ 20023లో $515.31 బిలియన్లుగా ఉండగా, 2024కి $621.19 బిలియన్లకు చేరుకుంది. ఇది 2032 నాటికి $2740.46 బిలియన్లకు పెరుగుతందని అంచనాగా ఉంది. 2027నాటికి భారత ఎఐ మార్కెట్ $17 బిలియన్లకు చేరే అవకాశముంది. తయారీ వంటి రంగాల్లో మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లలో 28శాతం మేర ఎఐ ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
4.2లక్షల ఎఐ వృత్తినిపుణులు కలిగిన భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ధ మానవవనరుల కేంద్రంగా ఆవిర్భవించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ 2030నాటికి భారత్ 9లక్షల వైట్ కాలర్, 3.6 మిలియన్ల పరోక్ష ఉద్యోగాలు సృష్టిస్తుందని అంచనాగా ఉంది. ఈ పరిణామం వర్క్ ఫోర్స్ ను ఛాంపియన్స్ గా, ఇండస్ట్రీ లీడర్స్ గా తయారు కావడానికి దోహదపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కేంద్రప్రభుత్వం నాస్కామ్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఐఓటి, ఎఐ అభివృద్ధి కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసింది. ఇది డీప్ టెక్ ఆవిష్కరణల్లో గణనీయమైన పురోగతి సాధించింది. గత ఏడాది రాష్ట్రంలో కొత్తగా 8ఎఐ, ఐఓటి స్టార్టప్ ల కోసం రూ. 131కోట్ల నిధులు పొందాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా ఎపిలోని అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో 3నాలెడ్జి సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఎఐ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఎఐ, 5 ప్రపంచస్థాయి మల్టీ డిసిప్లినరీ విద్య, పరిశోధన విశ్వవిద్యాలయాలు ఉంటాయి.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ను వరల్డ్ క్లాస్ టెక్ సర్వీసెస్ హబ్ గా తీర్చిదిద్దాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. విజన్ 2047 మిషన్ లో భాగంగా ఎఐ, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ పై దృష్టి సారించే ప్రధాన డీప్ టెక్ గ్లోబల్ హబ్ గా ఎపిని నిలబెట్టడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాం. మా విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు గారి థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో ముందుకు సాగుతున్నాం.
ఏపీ ట్రాన్స్ కోలో ఎఐ అండ్ ఎంఎల్ వినియోగం ద్వారా 15నిమిషాల వ్యవధిలో విద్యుత్ డిమాండ్ అంచనా వేస్తున్నాం. విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించడం, గ్రిడ్ నిర్వహణను ఆప్టిమైజ్ చేయడం కోసం ఎఐని వినియోగిస్తున్నాం. విశాఖపట్నంను ఎఐ, టెక్ హబ్ గా మార్చేందుకు వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. గ్లోబల్ సర్వీసెస్, అత్యాధుక ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి గూగుల్ సంస్థతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.