పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తలపై దాడి దుర్మార్గపు చర్య

Spread the love

– ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతి బాగోతం బయటపడుతుందనే ప్రమాణానికి రాకుండా పిరికిపందలా పారిపోయారు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ రౌడీ మూకలు పెట్రేగిపోతున్నాయి. పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేయటం దుర్మర్గపు చర్య. ఆద్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అరాచకాలు, అక్రమాలకు నిలయంగా మార్చారు. పుట్టపర్తి నియోకవర్గంలో శ్రీధర్ రెడ్డి అక్రమ భూదందాలకు పాల్పడుతున్నారు. బిల్డర్లను బెదిరించి శ్రీధర్ రెడ్డి డబ్బులు వసూలు చేశారు. తోపుడు బండ్ల వ్యాపారం చేసుకునే వారి దగ్గర నుంచి కాంట్రాక్టర్ల వరకు అందరి దగ్గర శ్రీధర్ రెడ్డి కమీషన్లు వసూలు చేస్తున్నారు.

శ్రీధర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు కాబట్టే పల్లె రఘునాధ్ రెడ్డి విసిరిన సవాల్ కి పారిపోయారు. ప్రమాణం చేయడానికి రాకుండా పిరికిపందలా పారిపోయిన శ్రీధర్ రెడ్డి వైసీపీ గూండాల చేత టీడీపీ కార్యకర్తలపై దాడి చేయించటం సిగ్గుచేటు. వైసీపీ రౌడీ మూకలు పట్టపగలు పూటుగా మద్యం తాగి టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? దాడి చేసిన వైసీపీ గూండాల్ని వదిలేసి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జీ చేయటం ఏంటి? టీడీప కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.

Leave a Reply