Suryaa.co.in

Telangana

ఏబీవీపీ కన్వీనర్ ఆదిత్యపై కత్తులతో దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య

– బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

హైదరాబాద్: హుస్నాబాద్‌లో ఏబీవీపీ సిద్ధిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్యపై జరిగిన హత్యాయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఓ యువ నాయకుడిపై కత్తులతో దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇలాంటి హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయి, ఇవి భవిష్యత్ తెలంగాణకు ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. ఈ దాడి వెనుక ఉన్న గూండాలను వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల గొంతు నొక్కే కుట్రలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం.

ఈ దాడులు ఎవరి ప్రోత్సాహంతో, ఆదేశంతో జరుగుతున్నాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. హుస్నాబాద్ ప్రాంతాన్ని హత్యా రాజకీయాలకు అడ్డాగా మార్చే కుట్రలను బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఏబీవీపీ కార్యకర్తలు బెదిరింపులకు, దాడులకు భయపడే వారు కాదు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిస్తూనే ఉంటారు.

ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణం స్పందించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలకు పూర్తి బాధ్యత అధికార ప్రభుత్వానిదేనని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE