ఆలయాలపై దాడులేనా మీ సర్కారు ప్రగతి?

– ట్విట్టర్‌లో జగన్‌పై పవన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్ వేదికగా మరోసారి ఘాటు విమర్శలు సంధించారు.. దేవాలయాలు, విగ్రహాలపై 140 దాడులు, విధ్వంసాలు. వైసీపీ పాలనలో రెండున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన ప్రగతి ఇదేనంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!.. హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.. ఎక్కడున్నారు పాలకులంటూ.. పవన్‌ విమర్శలు సంధించారు.
వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయిందంటూ మరో ట్విట్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌. వాలంటీర్ ఫెలిసిటేషన్ – 261 కోట్లని పవన్‌ పేర్కొన్నారు. 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల ఫండ్ మళ్లించలేదా అంటూ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. పాలసీ టెర్రరిజం, ఏపీ వాణిజ్యం ఏకస్వామ్యంగా మారగలదా అని పేర్కొన్నారు. ఎవరికి ఏ మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు.
రేషన్ కోసం ఏర్పాటు చేసిన డెలివరీ వ్యాన్లు ఎవరి కోసం, రివర్స్ టెండర్ ఆర్టికల్ 19 (1) (గ్రా) పోలవరం పురోగతి ఏది?.. అంటూ ప్రశ్నించారు. అమరావతి రైతులు, సరస్వతి పవర్, పరిశ్రమలను మోసం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం సిమెంట్‌ను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుందా? .. ఇప్పటికే సిమెంట్ కంపెనీలు 25,000 కోట్ల లాభాన్ని ఆర్జించాయని పేర్కొన్నారు.
ఏపీఎస్‌డీసీఎల్‌కి (APSDCL) ప్రపంచ బ్యాంక్ రుణాన్ని నిలిపివేసిందని పేర్కొన్నారు. ఏపీ సంపద లేదని జనరేషన్ రుణ హక్కును రద్దు చేసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లేదని.. నవరత్నాలు కాదు.. నవ కష్టాల పాలసీ టెర్రర్ అంటూ పవన్‌ పేర్కొన్నారు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం చేసిన పాలసీ టెర్రరిజానికి ఉదాహరణలు అంటూ పవన్‌ విరుచుకుపడ్డారు.

Leave a Reply