-
రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
-
70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్
-
పేర్లు నమోదుకోసం మొబైల్ యాప్, వెబ్ పోర్టల్
-
మిగతా ఆరోగ్య బీమా పథకాల లబ్దిదారులకు వర్తింపు
(శివ శంకర్. చలువాది)
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం. పేదలకు ఆరోగ్య బీమాను అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సకు సాయం అందుతుంది. అయితే, తాజాగా, ఈ పథకాన్ని 70 ఏళ్లు నిండిన సీనియర్లకు వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించింది. ఈ క్రమంలో పథకంలో చేరే లబ్దిదారులు పేర్లను నమోదు కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
ఈ పథకంతో ప్రయోజనం పొందాలనుకునే సీనియర్ సిటిజన్ల నమోదుకు ఆయుష్మాన్ మొబైల్ యాప్ (Ayushman), వెబ్‌సైట్‌లో (Beneficiary.nha.gov.in) ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొంది.