– టీడీపీ మానిఫెస్టోతో వైసీపీ మాయం అవ్వడం ఖాయం అంటూ వైసీపీ ఎంపీకి అయ్యన్నపాత్రుడు ట్వీట్ కౌంటర్
ఎంపీ సాయిరెడ్డికి పార్టీలో ఉనికి సమస్య మొదలైనట్లు ఉంది. చాలా రోజుల తరువాత పార్టీ ఆఫీస్ కు వచ్చిన సాయిరెడ్డి టీడీపీ మేనిఫెస్టో పై విమర్శలు చేసి జగన్ దృష్టిలో పడేందుకు నానా పాట్లు పడుతున్నారు.మహానాడులో తెలుగుదేశం ఇచ్చిన మొదటి ఫేజ్ మేనిఫెస్టో వైసీపీ నేతలకు నిద్రలేకుండా చేస్తుందని రోజూ వాళ్ల ఉలిక్కిపాటు చూస్తేనే అర్థం అవుతుంది.
రూ. 2 కిలో బియ్యం వంటి కొత్త పథకాలు…..మహిళలకు ఆస్తిహక్కు వంటి నిర్ణయాలు….ప్రజల వద్దకు పాలన వంటి సంస్కరణలు….జన్మభూమి వంటి కార్యక్రమాలు…విజన్- 2020తో ప్రజల బతుకులు మార్చిన ఆలోచనలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎవరినీ కాపీ కొట్టాల్సిన అవసరం లేదని మీరు, మీ పేటీఎం గాళ్లు తెలుసుకోవాలి.
What CBN thinks today…nation thinks tomorrow. దేశం రేపు చేసే ఆలోచనను….మా అధినేత చంద్రబాబు గారు నేడు ఆలోచించి అమలు చేస్తారు. అదీ ఆయన గట్స్…విజన్. 4 దశాబ్దాల తెలుగుదేశం తెచ్చిన పాలసీలను…తర్వాత దేశం ఫాలో అయ్యిందన్న విషయం నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన మీకు ఎలా తెలుస్తుందిలే!
మేం ప్రకటించింది మాయా ఫెస్టో కాదు….ఏపీ రాజకీయాల నుంచి వైసీపీని మాయం చేసే తిరుగులేని మేనిఫెస్టో. సాయిరెడ్డీ…మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం నిజం ఉంది….అందరినీ అన్నివేళలా ఎవరూ మోసం చేయలేరు. ఒక్క ఛాన్స్ తో మీరు చేసిన మోసాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు…మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా మళ్లీ ప్రజలను మోసం చెయ్యలేరు.