జగన్ రెడ్డి శాడిజం పనుల్ని ఎవరూ ప్రశ్నించకూడదా?

– నర్సీపట్నం ఎమ్మెల్యే అటవీప్రాంతాన్ని తన అడ్డాగా మార్చుకొని గంజాయి, రంగురాళ్ల వ్యాపారంచేస్తుంటే అధికారయంత్రాంగం ఏం చేస్తోంది.
• అటవీ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అధికారపార్టీ శాసనసభ్యుడి అవినీతికి అడ్డుకట్టవేయకపోతే, ఆయన చీకటివ్యాపారంలో అధికారులు భాగస్వాములేనని భావించాల్సి ఉంటుంది
• జగన్ రెడ్డి అవినీతి ఆయన అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్నాననే నాపై 9 కేసులు పెట్టారు
• నర్సీపట్నం ఎమ్మెల్యే నన్ను అరెస్ట్ చేయించడానికి మూడురోజులు పోలీసులను పంపాడు కానీ, మూడుగంటలపాటు తననియోజకవర్గంలో సాగుతున్న గంజాయి వ్యాపారంపై సమీక్షచేయలేకపోయాడు.
– మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు

23వ తేదీన నర్సీపట్నంలో పోలీసులు తనఇంటిని ముట్టడించి చేసినహాంగామా అందరికీ తెలిసిందేనని, ఇప్పటికే ఈప్రభుత్వం తనపై 9తప్పుడుకేసులు పెట్టిందని, జగన్ రెడ్డిచేస్తున్న అవినీతి, ఆయన అవలంభిస్తున్న ప్రజావ్యతిరేకవిధానాలను ప్రశ్నిస్తున్న నాలాంటి వారందరి నోళ్లు మూయించడానికే, పాలకులుతప్పుడు కేసులు, వేధింపులమార్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.

ఆయన తన మీడియాసందేశాన్ని వీడియో రూపం లో విలేకరులకు అందచేశారు. ఆ వివరాలు ..
ప్రజలుఎన్నుకున్న నాయకులు,ప్రభుత్వం చేసే తప్పులపై, అవినీ తిపై మాట్లాడే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. దాన్నికూడా కాదని జగన్ రెడ్డి ఈ రాష్ట్రం తన రాజ్యంలా, తానేదో మహారాజులా ప్రవర్తించడం మంచిపద్ధతికాదు. అలాంటి వైఖరిని శాడిజం అనాలి. ముఖ్యమంత్రి శాడిజంచూపిస్తుంటే ప్రజలు భరించాలా? నేను ఏం తప్పుచేశానని నాపై 9కేసులుపెట్టారు? రాష్ట్రంకోసం, ప్రజలతరుపు న తాముమాట్లాడకూడదా? రాష్ట్రంలో 100కి 80శాతం మంది ప్రజలు జగన్ రెడ్డి పాలనను, నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు.

ఆ విషయం ఈముఖ్యమంత్రిఎందుకు తెలుసుకోడు? మూడేళ్లపాలన పూర్తైంది…ఇక మిగిలింది సంవత్సరమే. ఆఖరి సంవత్సరంఎవరూ కూడా ముఖ్యమంత్రి మాటవినరు. జగన్ రెడ్డికి భజనచేస్తున్నవారితోపాటు, అధికారులుకూడా ఆఖరిసంవత్సరం లో ఎవరినీ లెక్కచేయరు. ఆఖరిగా మిగిలిన 365రోజుల్లోనైనా జగన్ రెడ్డి తనతప్పులను సరిదిద్దుకుంటే మంచిదనిహితవు పలుకుతున్నాం.
గంజాయి, ఇతరమాదకద్రవ్యాల వ్యాపారం నర్సీపట్నం కేంద్రంగా విచ్చలవిడిగా సాగుతోంది. ఆవ్యాపారమంతా వైసీపీకనుసన్నల్లో వారి ఆధ్వర్యంలోనే జరుగుతోందని చెప్పడానికి నావద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయి. పోలీసులు ఇప్పటివరకు గంజాయిస్మగ్లింగ్ , అమ్మకాలకు సంబంధించి తీసుకున్నచర్యల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నా.

నర్సీపట్నం ఖనిజసంపదకు నిల యం. పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులోని నాతవరంలో లేటరైట్ ముసుగులో విచ్చలవిడిగా బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నా యి. ఆ ఖనిజమంతా భారతిసిమెంట్స్ కు చెందిన లారీల్లో రాత్రికి రాత్రే మొత్తం కడపకు చేరుతోంది. పోలీసులే దగ్గరుండి ఆఖనిజ రవాణా వాహనాలను పంపిస్తున్నారు. నాతవరంప్రాంతంలో జరు గుతున్న బాక్సైట్ దోపిడీకి ఏపీ మైనింగ్ శాఖతోపాటు, అటవీశాఖాధికారులు దగ్గరుండి సహకరిస్తున్నారు. తమప్రాంతా ల్లో జరిగే అక్రమ బాక్సైట్ మైనింగ్ అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు నోరుతెరవడంలేదు?

నర్సీపట్నంలో జరిగే గంజాయి, ఇతరమాదకద్రవ్యాలవ్యాపారంలో కూడా అధికారపార్టీనేతల హస్త ముంది. ఇదంతా పోలీసులకు కూడా తెలుసు. అధికారపార్టీనేతల గంజాయిఅమ్మకాలు, అక్రమ బాక్సైట్ వ్యవహారంపై అధికారులు నోరెత్తలేని స్థితిలోఉన్నారు. సాలికమల్లవరం అనేపంచాయతీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలకు ఇప్పటికే ఒక ముఠాతయారైం ది. ఆ ముఠాకు నర్సీపట్నం ఎమ్మెల్యేనే నాయకత్వంవహిస్తున్నా రు. అటవీప్రాంతంలో వైసీపీఎమ్మెల్యే రంగురాళ్ల తయారీకి సిద్ధమై తే అటవీఅధికారులు ఏంచేస్తున్నారు?

పోలీసులు ఎమ్మెల్యేని ప్రశ్నించి ఎందుకు విచారించలేకపోతున్నారు? నర్సీపట్నానికి ఎమ్మెల్యే అయినంతమాత్రానా ఇష్టమొచ్చినట్లుదోచుకోవడానికి ప్రజలు అనుమతి ఇచ్చారా? నన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపడానికి మూడురోజులు ప్రయత్నించిన నర్సీపట్నం ఎమ్మెల్యే మూడుగంటలపాటు రంగురాళ్లనుకాపాడటానికి అధికారులతో ఎందుకుసమీక్ష చేయలేకపోయాడు? రంగురాళ్ల వ్యవహారంపై స్థానికపోలీసులు, అటవీశాఖాధికారులుస్పందించకపోతే, ఎమ్మెల్యే దోపిడీలో వారికికూడా భాగముందనే భావించాల్సి వస్తుంది. అధి కారులు దోషులగా మారి న్యాయస్థానాలముందుచేతులు కట్టు కొని నిలబడే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటేమంచిది.

నర్సీపట్నం ఎమ్మెల్యే గంజాయివ్యాపారం చేయడంపై, రంగురాళ్లతవ్వకం, అక్రమబాక్సైట్ తవ్వకాలపై పెట్టేసమయాన్ని తననియోజకవర్గ అభివృద్ధిపై పెడితే మంచిదని సూచిస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి నర్సీపట్నాన్ని జిల్లాను చేస్తానని ప్రగల్భాలుపలుకుతున్న సదరు వ్యక్తి, ముందు తనదోపిడీని ఆపేస్తే మంచిది. నర్సీపట్నం ప్రాంతంలో జరుగుతున్న రంగురాళ్లతవ్వకం, గంజాయి అమ్మకా లపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలుతీసుకోవాలని డి మాండ్ చేస్తున్నాం.

అధికారయంత్రాంగం స్పందించకపోతే, ఎమ్మె ల్యే అవినీతిలో వారు భాగస్వాములైనట్టే లెక్క. నర్సీపట్నంలో తనఇంటిని పోలీసులు ముట్టడించినప్పుడు తనకు అండగా నిలిచిన టీడీపీ కార్యకర్తలు, నేతలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Leave a Reply