– కాంగ్రెస్ కుట్రలకు మీ ఓటుతో బుద్ది చెప్పండి
– తెలంగాణలో పాలన గాడితప్పింది
– ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యింది
– దమ్ముంటే నాతో ప్రచారంలో రండి నిరూపిస్తా
– కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ డీకే.అరుణ సవాల్
– ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ బీఆరెస్ లకు ఓట్లడిగే హక్కు లేదు
– జూబ్లీహిల్స్ ప్రజలకు ఎంపీ డీకే అరుణ పిలుపు
– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ మీడియా సమావేశం
హైదరాబాద్: తెలంగాణ ఖజానాను కొల్లగొట్టేలా కాంగ్రెస్ పాలన నడుస్తోంది. దోచుకోవడాలు.. పంపకాల పంచాయితీలు. సీఎం నుంచి మంత్రుల దాకా అందరికీ అదే తీరు. మంత్రుల మధ్య పంపకాల పంచాయంతి నడుస్తోంది. ఈ పరిస్థితిని ప్రజలంతా గమనించాలి. అనుభవలోపం మీ పాలనలో స్పష్టంగా కనిపిస్తోంది. మరో ముడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మీ పార్టీ ఎమ్మెల్యే లే అంటున్నారు.
కుట్రలో భాగమే.. ఆ మంత్రి పదవి
ఓట్లకోసం, సీట్ల కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. జూబ్లీహిల్స్ లో ఓటమి భయంలోనే అధికార కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. బీఆరెస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతోనే బీజేపీ గెలవదంటూ అసత్య ప్రచారాలు. కాంగ్రెస్ పార్టీ కీ ఓటమి భయం పట్టుకుంది. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకే మంత్రి వర్గంలో అజహరుద్దీన్ ను తీసుకోవాలని చూస్తున్నారు.
హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లడిగే హక్కులేదు. ఇచ్చిన హామీలు అమలు చేస్తామంటూ ఎక్కడ పడితే ఆ గుడి దేవుడి మీద ఒట్లేశారు. ఇప్పుడు చేతులెత్తేశారు.
అసలు మీరేం చేశారు?
రోడ్లు వేసింది లేదు, ఇండ్లు ఇచ్చింది లేదు. వికలాంగులకు, వితంతులకు పెన్షన్ పెంచలేదు. మహిళలకు 2500 భృతి ఇవ్వలేదు. నిరుద్యోగులకు 4000 భృతి ఇవ్వలేదు, కాలేజీ స్టూడెంట్స్ కి స్కూటీలు ఇవ్వలేదు. Pm ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇండ్లు కూడా అర్హులకు అందనివ్వడంలేదు. అలాంటిది ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో ఓట్లడుగుతుంది. ఈ సారి బీజేపీ కీ ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ముస్లిం ల ఓట్లతో గెలవాలని చూస్తోంది.
ఆలోచించండి… ఓటేయండి
ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలి. జూబ్లీహిల్స్ లో మొత్తం 4 లక్షల పైచిలుకు ఓటర్లుంటే వారిలో 1లక్ష ఓటర్లకు పైగా ముస్లిం మైనార్టీ ఓటర్లున్నారు. లక్షకు పైగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని చుస్తునారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఈ దుష్ట ప్రచారన్ని ప్రజలు గమనించాలి , కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి. ప్రజలందరూ ఆలోచించి ఓటెయ్యాలి. ముస్లింల మద్దతు మా బీజేపీకికూడా ఉన్నది. వాళ్ళ కోసం. ట్రిపుల్ తలాఖ్ రద్దు చేసింది మేమే. జూబ్లీహిల్స్ లోని మైనార్టీలు ఆవిషయాన్ని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు తిప్పకొట్టాలి. లంకల దీపక్ రెడ్డి ని గెలిపించి అసెంబ్లీ కీ పంపండి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ అసమర్థ కాంగ్రెస్ప్రభుత్వానికి బుద్ది చెప్పే ఎన్నిక. కేంద్రంలో బీజేపీ అధికారంలో లేకుంటే.. తెలంగాణాలో అభివృద్దే లేదు. ఇప్పటికే తెలంగాణకు కేంద్రం 10 కోట్లకు పైగా నిదులు ఇచ్చింది
అవగాహన లేకనే..
కొడంగల్ – వికారాబాద్ రైల్వై లైన్ అంటూ కొందరు వార్తలు రాస్తున్నారు. ఈ లైన్ రాష్ట్ర ప్రభుత్వమే తీస్తున్నట్లు రాస్తున్నారు. సీఎం కొండగల్ వికారాబాద్ అని కొత్త లైన్ ఏమైనా తెచ్చాడా? అది కృష్ణా – వికారాబాద్ రైల్వే లైన్. అవగాహన లేకుండా జర్నలిస్టులు వార్తలు రాస్తే ఎలా? రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే వాళ్లే తెచ్చినట్లుఅవుతుందా?