“బాబు నోటు రాజకీయం”పై విచారణ జరగాలి

– నాటి వైశ్రాయ్‌ నుంచి నిన్నటి ఎమ్మల్యేల కొనుగోలు వరకూ బాబుది అదే తీరు
– సీబీసీఐడీ, ఈడీలు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
– ఈడీలాంటి సంస్థలు ఇంత డబ్బు ఎలా ప్రయాణం చేసిందో వెలికితీయాలి
– మొన్న తెలంగాణ, నేడు ఏపీలో ఓటుకు నోటు వ్యవహారాలకు మూలం చంద్రబాబే
– శ్రీదేవి స్క్రిప్ట్‌ బాబుదే..
– మీ బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకే సజ్జల గారిపై ఆరోపణలు
– ఇక్కడ నీ గురించి ఎవరూ ఆలోచించడం లేదు…భయపడాల్సిన పనిలేదు
– పెద్దవాడిగా చెప్తున్నా…కులాన్ని వాడుకోవద్దు
– వచ్చినప్పటి నుంచీ రాజకీయాల్లో నువ్వు వివాదమే చేసుకున్నావ్‌
– నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందర్నీ బాధ్యులను చేయడం సరికాదు
– జగన్మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు
– డొక్కా మాణిక్యవరప్రసాద్

– నిన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఒక ప్రత్యేక విషయాన్ని ప్రస్తావించారు
– తనకు డబ్బులివ్వడానికి ఒక ఎమ్మెల్యే ద్వారా చంద్రబాబు మనుషులు కొందరు సంభాషించారని చెప్పాడు
– ఆ ఆఫర్‌ను తాను రిజెక్ట్‌ చేశానని కూడా రాపాక వరప్రసాద్‌ చెప్పారు..
– నేను మాట్లాడిన మాట వాస్తవమేనని ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకున్నారు
– ఇంతటి దుర్మార్గానికి పాల్పడినందుకు ఆ వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది
– గతంలో తెలంగాణా రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారు
– మళ్లీ మన రాష్ట్రంలో అటువంటి ప్రయత్నాలే చేయడం దుర్మార్గమైన విషయం
– ఈ వ్యవహారంపై.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి
– ఒక్కొక్క ఎమెల్యేకి రూ.10 నుంచి 20 కోట్లు ఇస్తామన్నారని రాపాక, మద్దాళి గిరి కూడా తెలిపారు
– వీటన్నిటిపై వెంటనే సీబీసీఐడీ విచారణ జరపాలి…దీనికి సంబంధించిన వారిని అరెస్ట్‌ చేయాలి
– ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నా
– తెలంగాణాలో జరిగిన ఓటుకు నోటు కేసును కూడా దీనితో కలిపి విచారించాలి
– ఈడీ లాంటి సంస్థలు ఇంత డబ్బు ప్రయాణం చేసిన ఈ సందర్భాన్ని, ఎలా డబ్బు తరలింది అనేది విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి
– తెలుగు రాష్ట్రాల్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఒకే వ్యక్తి వద్ద నుంచి ప్రారంభం అయ్యింది.

వైశ్రాయ్‌ నుంచి నిన్నటి వరకూ మారని బాబు తీరు:
– ఇలాంటి అనైతిక చర్యలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి
-1995లో వైశ్రాయ్‌ క్యాంపు దగ్గర నుంచి నిన్నటి ఓటుకు నోటు వరకూ గమనించండి
– ఇప్పుడు వరప్రసాద్, గిరితో మాట్లాడటం చూడండి..ఇవన్నీ ఒకే సోర్స్‌ నుంచి జరుగుతున్నాయి
– ఆ సోర్స్‌ను పట్టుకుని ఆపగలిగితే ప్రజాస్వామ్యానికి మంచింది..భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి
– విచారణ సంస్థలకు ఎక్కడ పట్టుకుంటే ఇది ఆగిపోతుందో నేను క్లూ ఇస్తున్నా..

అమరావతి అన్నావంటే స్క్రిప్ట్‌ ఎక్కడిదో అర్ధం కావడం లేదా..?:
– ఉండవల్లి శ్రీదేవి గారు తన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు…వెళ్లిపోయారు
– ఆమె ఒక్కదాన్నే కాదు నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు
– పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఇతర పార్టీలతో కలిసిపోయారనేది పార్టీ నమ్మింది
– దానిపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్‌ చేశారు
– ఎందుకు ఆమె కంగారుపడి అమరావతి నినాదాన్ని ఎత్తుకున్నారు..?
– నువ్వు తెలుగుదేశం వారితో వెళ్లావని చెప్పడానికి ఇంతకంటే ఆధారం అవసరం లేదు
– నిన్న నువ్వు మాట్లాడిన స్క్రిప్ట్‌ అంతా యథాతథంగా టీడీపీదే.
– నువ్వు తెలుగుదేశానికి సహకరించుకోవాలి అనుకుంటే సహకరించుకో
– నీ బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు, నీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలని సజ్జల గారితో నాకుప్రాణ హాని అనడం సరైంది కాదు
– అంత పెద్ద వారి గురించి ఎందుకు..? నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారని అంతటి పెద్ద పెద్ద మాటలు..?

పెద్దవాడిగా చెప్తున్నా…కులాన్ని వాడుకోవద్దు:
– మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయరు…మీ మార్గం మీరు ఎంచుకున్నారు..దయచేసి మీ పని మీరు చేసుకోండి
– ఒక పెద్దగా, సీనియర్‌గా, మీ నాన్నకు స్నేహితుడిగా చెప్తున్నా…ఒక కుల పెద్దగా కూడా చెప్తున్నా
– ఇలాంటి విషయాల్లో కులాన్ని వాడుకోవద్దు…మీ నాన్న ప్రతిష్టను పాడుచేయవద్దు
– పెద్ద పెద్ద పేర్లు వాడటం వల్ల నీకు ఏమీ మంచి పేరు రాదు
– వచ్చినప్పటి నుంచీ రాజకీయాల్లో నువ్వు వివాదమే చేసుకున్నావ్‌
– ఎన్నిసార్లు చెప్పినా నీ ప్రవర్తనలో మార్పు రాలేదు
– నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందర్నీ బాధ్యులను చేయడం సరికాదు
– పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పడం వల్ల పేపర్లో ఒక రోజు పేరు వస్తుందేమీ కానీ నీకు ఒరిగేది ఏమీ లేదు
– ఇలాంటి చర్యల వల్ల సమాజం హర్షించదు..వాస్తవం ఏం జరిగిందో ప్రజలకు తెలుసు
– నీకు బంధువుగా, కులపెద్దగా చెప్తున్నా…కులాన్ని తీసుకురావద్దు…పెద్ద వాళ్ల పేర్లు వాడొద్దు

ప్రభుత్వం నీకు కావాల్సిన రక్షణ కల్పిస్తుంది:
– నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు చూసుకో..నీకు ఎలాంటి భయం లేదు
– ప్రభుత్వం నీకు ఏం రక్షణ కావాలో అది కల్పిస్తారు..ఎక్కడైనా నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు
– ఎవరిమీదా వైల్డ్‌ ఎలిగేషన్స్‌ చేయవద్దు…చేసి మీనాన్న ప్రతిష్టకు, కుల ప్రతిష్టకు భగం కలిగించవద్దు
– సజ్జల గారు చంపాలని చూస్తున్నాడంటూ అంత పెద్ద మాటలు మాట్లాడతావా అమ్మా..?
– నేను రిక్వెస్ట్‌ చేస్తున్నా…అలాంటి పొరపాట్లు భవిష్యత్తులో చేయవద్దు
– కొన్ని మీడియా వాళ్లు, రాజకీయ పార్టీలు నిన్ను రెచ్చగొడతారు…
– రాజకీయంగా నీ ప్రయాణం నువ్వు చేసుకో…దానికి మేమేం అడ్డు చెప్పడం లేదు
– కానీ కులాన్ని వాడుకోవద్దని మాత్రం ఒక పెద్దవాడిగా చెప్తున్నా

జగన్‌ నాయకత్వంలో దళితులంతా గౌరవంగా ఉన్నారు:
– జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు
– ఎమ్మెల్యే శ్రీదేవిని కూడా ఆయన చాలా గౌరవంగా చూసుకున్నారు
– ఇక ఇలాంటి వివాదాలు క్లోజ్‌ చేసి రాజకీయంగా నువ్వు ఎటు వెళ్తావో అటు వెళ్లు
– అనవరంగా వివాదాస్పద విషయాలు మాట్లాడి వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు
– కులాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి ప్రయోగాలు చేయవద్దని నా మనవి

Leave a Reply