Suryaa.co.in

Andhra Pradesh

బాబు ప్రజాగళం సభను విజయవంతం చేయాలి

సత్తెనపల్లిలో ఇంటింటికీ తెలుగు మహిళల ఆహ్వానం

సత్తెనపల్లి: సత్తెనపల్లి నియోజకవర్గంలో శనివారం జరగనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోడ్డు షో, ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగు మహిళలు పిలుపునిచ్చారు. ఈ మేరకు సత్తెనపల్లి పట్టణంలోని 11, 12 వార్డులలో తెలుగు మహిళలు ఇంటింటికీ తిరిగి సభలో పాల్గొనాలని బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మండవ శారదాదేవి, పార్లమెంట్‌ ఉపాధ్యక్షురాలు సంధ్య, ఈదర శాంత కుమా రి, బద్దుల శిరీషా, బండారుపల్లి తులసి, నల్లమోతు అవంతి, తక్కెళ్లపాటి లక్ష్మి, పట్టణ మహిళలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE