ఉనికి కోసమే టీడీపీ రాజకీయ వికృత క్రీడ

– బాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలే
– కుట్రలతో బాబు ప్రజాభిమానాన్ని పొందలేడు
– ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్న నాయకుడు జగన్
– ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌
గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాభిమానం కోల్పోయి… ప్రజల నుంచి ఆదరణ కోల్పోయి, మరోవైపు సొంత పార్టీ నుంచి వస్తున్న తిరుగుబాటును చూసి ఓర్వలేక, పార్టీని కాపాడుకోలేక.. రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు నాయుడు వికృత క్రీడను ప్రారంభించాడు.
రాజకీయ పార్టీగా రాజకీయాలు చేసుకోవచ్చు. హుందాగా రాజకీయాలు ఉండాలే కానీ, పార్టీని బూతులు ఫ్యాక్టరీగా మార్చకూడదు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు హైజాక్ చేసిన నాటి నుంచి ఆ పార్టీలో హుందాతనం కనుమరుగు అయిపోయింది. దాన్ని తారాస్థాయికి తీసుకువెళుతున్న వ్యక్తి చంద్రబాబు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు… నిన్న తన అనుచరులతో మాట్లాడించిన మాటలు దారుణాతిదారుణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, ఎన్నికల సమయంలోగానీ, స్థానిక ఎన్నికల ఫలితాల లెక్కింపు సమయంలో కూడా విజయవాడలో లేని చంద్రబాబు.. నిన్న ఒక ప్రణాళికబద్ధంగా ముందే ఇక్కడకు చేరుకున్నారు. చంద్రబాబు ఇంత ఆకస్మికంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు వచ్చారు?
తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చి, రెచ్చగొట్టేలా, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయాలనే ఉద్దేశంతో ఉదయాన్నే పట్టాభితో ప్రెస్‌మీట్‌ పెట్టించి గౌరవ ముఖ్యమంత్రిపై ఘోరాతి ఘోరంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయించారు. కోట్లాదిమంది ప్రజల అభిమానం ఉన్న నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అయినా, పార్టీ శ్రేణులను కార్యకర్తలను సంయమనంతో పాటు ఓపిగ్గా ఉండమని కోరారు.
అయితే కార్యకర్తలు, నాయకులు సంయమనం కోల్పోయే పరిస్థితిని చంద్రబాబు తెస్తున్నారు. బాబు, లోకేష్ ఆయన పార్టీ నేతలు మాట్లాడే భాష, వారి బాడీ లాంగ్వేజీ.. ఎలా ఉందనేది ప్రజలు చూస్తున్నారు. ఏ చెత్త మాట్లాడినా, రాసేందుకు సొంత మీడియా ఉందని మాజీ మంత్రులతో నీచంగా మాట్లాడిస్తున్నారు. పట్టాభి మాట్లాడిన మాటలు కన్న తల్లులు, ఆడవారిని కించపరిచేలా లేవా..? పట్టాభి మాట్లాడే మాటలు ఎవరికి వర్తిస్తాయి.
వయసు పెరిగే కొద్దీ ఆయన తీరు దారుణంగా తయారైంది. చంద్రబాబు దిగజారుడు తనాన్ని ప్రజలు ఇంకా ఎంతకాలం భరిస్తారు? మొనగాడిలా దేశ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై మీరు మాట్లాడిన పదాలు, వ్యాఖ్యలు మీకే వర్తిస్తాయి.
గతంలో పరిటాల రవి హత్య జరిగిన సమయంలో అల్లర్లను ప్రేరేపించింది ఎవరు? రాజకీయాల కోసం ఇంతలా దిగజారుతారా? – వెన్నుపోటు, కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌ అని చంద్రబాబుకు బిరుదు.
అనునిత్యం ప్రజల ఆదరణ పొందుతున్న వైఎస్ జగన్‌ని చూసి ఓర్వలేకే బాబు కుట్రలు చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు ఉండాలి. వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడే వ్యవస్థలను బ్రష్టు పట్టించేలా కుట్రలు, కుతంత్రాలు చేశారు. చంద్రబాబుకు ఇది పద్ధతి కాదు. ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నం చేయాలి కానీ, ఇలా నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు..
ఈ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ముం దుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. లేదా.. అన్నది రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి అయినా ప్రజలని అడిగి తెలుసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పై ఏక్కడైనా పొరపాట్లు ఉంటే నేరుగా తెలియజేయండి.
ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ, రాజకీయాల్లో విశ్వసనీయతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . ఎంత రెచ్చగొట్టినా.. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడూ సంయమనం కోల్పోరు, సహనంతో ఉంటారు. చంద్రబాబుకు హుందాతనం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి క్షమాపణ చెప్పాలి.
ప్రతి ఎన్నికల్లో.. ప్రజలు ఎంతగా బుద్ధి చెప్పినా చంద్రబాబు బుద్ధి మాత్రం మారడం లేదు. కరోనా నేపథ్యంలో చిరు వ్యాపారులు కష్టకాలంలో ఉంటే బంద్‌కు పిలుపునివ్వడం ఏంటి? ప్రజలు ఎవ్వరూ మీకు మద్దతు ఇవ్వలేదు. చంద్రబాబుకు ఇప్పటికైనా సిగ్గు రాకపోతే ఎలా?
రాష్ట్రపతి పాలన పెట్టాలని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారన‍్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకుని మెలగాలి.