రామకుప్పంలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడం వైకాపా వెకిలి చేష్ట

Spread the love

-అంబేద్కర్ విగ్రహం వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శిలాఫలకం ఏర్పాటు ఆక్షేపణీయం
– గరగపర్రులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చేతగాని ప్రభుత్వానికి ఉయ్యాలవాడ శిలాఫలకం పై ప్రత్యేక శ్రద్ధ దేనికి?
– అంబేద్కర్ విగ్రహాలను,బొమ్మలను అగౌరవ పరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవ్
– రెండు కులాల మధ్య కుంపట్లు పెట్టి చలికాగుతారా? సీఎం గారూ
– అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని శివాజీ నగర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శిలాఫలకం ఏర్పాటుకు ప్రయత్నించటం ప్రభుత్వ వెకిలి చేష్టగా అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభివర్ణించారు .

సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో గరకపర్రు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని తెలిపారు.రామకుప్పంలో మాత్రం ఉయ్యాలవాడ శిలాఫలకం ఏర్పాటు పై శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు.

అంబేద్కర్ విగ్రహాలను అవమానించినా, అంబేద్కర్ బొమ్మలను అగౌరపరిచినా ప్రభుత్వానికి పుట్టగతులుండవని హెచ్చరించారు. రెండు కులాల మధ్య కుంపట్లు రాజేసి చలికాగాలని అనుకుంటున్న వైకాపా నాయకులకు వైఖరిని దళిత, బహుజన లోకం గమనిస్తున్నారని,తగిన గుణపాఠం చెప్పేందుకు బహుజనులు అంతా రెడీగా ఉన్నారని బాలకోటయ్య గుర్తు చేశారు

Leave a Reply