Suryaa.co.in

Telangana

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో బీసీ నేతల భేటీ

– పార్టీ, మరియు ప్రభుత్వ పదవుల్లో బడుగులకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షం వ్యక్తం చేసిన నేతలు
– కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న మహేష్ గౌడ్ ను అభినందించిన బీసీ సంఘాలు
– బీసీ మంత్రులకు ప్రాధాన్యత శాఖలు, సమాచార కమిషనర్ లుగా అవకాశం కల్పించాలని మహేష్ గౌడ్ ను కోరిన జాజుల

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నియమిత పదవులలో, ప్రభుత్వ పదవులలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు హైదరాబాదులోని పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను బీసీ సంఘాల నేతలు కలిసి అభినందించారు

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బిసి ప్రతినిధుల బృందం ఈరోజు, ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అమలు కోసం కృషి చేస్తున్న పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చని అందజేశారు

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో బడుగులకు న్యాయం చేసే దిశలో ఆలోచిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగడానికి, కాంగ్రెస్ పార్టీలో బడుగులకు ప్రాధన్యత దక్కడానికి, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లను ఒప్పించి బీసీలకు న్యాయం జరిగేలా మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు

ఇటీవల ఎమ్మెల్సీ పదవుల ఎంపికలో వందకు వంద శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళకు కట్టబెట్టడం, అలాగే రెండవ సారి మంత్రివర్గ విస్తరణలో కూడా ఇదే ఒరవడిలో మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యక్షులలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే 70 శాతం పదవులు బడుగులకు ఇచ్చారని, అతి ముఖ్యమైన పిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఇతర అన్ని కమిటీలలో కూడా బడుగులకు తగిన ప్రాధాన్యత కల్పించడం గొప్ప విషయం అన్నారు

గతంలో ఎన్నడ లేనివిధంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, లతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలతో సమన్వయం చేసుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ సామాజిక న్యాయం దిశగా, బడుగులకు సామాజిక సాధికారత కల్పించే విషయంలో శక్తివంచన లేకుండా కృషి చేయడం చాలా అభినందనీయమన్నారు

ఇదే సమయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సమాచార కమిషనర్ లో బీసీలకు అన్యాయం జరిగిందని,దీని నీ తక్షణమే సరిదిద్ది బీసీలకు సమాచారం కమిషనర్ గా అవకాశం కల్పించాలని అదేవిధంగా, రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ మంత్రులకు ప్రాధాన్యత గల శాఖలు కేటాయించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి రాష్ట్ర మంత్రివర్గంలో బడుగులకు ఏ విధంగా ప్రాధాన్యత కల్పించారో అదేవిధంగా బిసి మంత్రులకు శాఖల కేటాయింపులలో కూడా అదే ప్రాధాన్యత కల్పించాలని శ్రీనివాస్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు

పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన బీసీ ప్రతినిధుల బృందంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, కో ఆర్డినేటర్ ఉప్పరి శేఖర్ సగర, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ,
బీసీ నేతలు జాజుల లింగం గౌడ్, ఐలీ వెంకన్న, సింగం నగేష్, శంకరాచారి, నిద్ర సంపత్, దుర్గయ్య, బండి గారి వెంకన్న గౌడ్, భరత్ తదితరులు ఉన్నారు

LEAVE A RESPONSE