Suryaa.co.in

Andhra Pradesh

సోషల్ మీడియాపై వైసీసీ నాయకులు అచ్చేసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారు

  • అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో జిప్ విప్పి చూపించాడు
  • అవంతి శ్రీనివాస్ అరగంట చాలు పనికానిచ్చి పంపిచ్చేస్తా అని ఓ మహిళను అన్నాడు
  • అంబటి రాంబాబు గంట చాలన్నాడు
  • గోరంట్ల మాధవ్ వస్తున్నాడంటే జనం భయపడే పరిస్థితి
  • ఇప్పటిదాక వచ్చిన ఆడియోలు, వీడియోలపై జగన్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి
  • మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్

వైసీపీ నాయకులు ఏం చేసినా ప్రశ్నించకూడదు, ప్రసారం చేయకూడదు, ప్రచురించకూడదు అనే ధోరణిలో ఉన్నారు. మీడియా, ప్రతిపక్షాలు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియాపై వైసీసీ నాయకులు రెచ్చిపోతున్నారు. అచ్చేసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు భయభ్రాంతానికి గురౌతున్నారు. గడచిన మూడు సంవత్సరాలుగా అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో జిప్ విప్పి చూపించాడు, అవంతి శ్రీనివాస్ అరగంట చాలు పనికానిచ్చి పంపిచ్చేస్తా అని ఓ మహిళను అన్నాడు. గంట చాలన్నాడు మరో వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు. క్లబ్బులు పెట్టినా, గ్యాంబ్లింగ్ నడిపినా, పేకాట నిర్వహించినా, క్యాసినో జరిపినా ఏమీ చేయకూడదు.

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రిలీజ్ అయ్యాక వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాసలీలల్లో అడ్డoగా దొరికిపోయి అడ్డగోలుగా బుకాయిస్తున్నారు. వైసీపీ నాయకులపై ఇప్పటిదాక వచ్చిన ఆడియోలు, వీడియోలపై జగన్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఎన్టీరామారావు కుమార్తె మరణాన్ని కూడా నీచ రాజకీయాలకు వాడారు. కోడిపందేలు, గ్యాంబ్లింగ్, క్యాసినో నిర్వహించినా మీరెవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అనే ధోరణిలో వైసీపీ నాయకులు ఉన్నారు.

నీచ వ్యవహారాల పార్టీ వైసీపీ. వికృత చేష్టలపై మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నించకూడదు. గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ చేసి విడుదల చేయాల్సిన అఘాయిత్యం టీడీపీకి పట్టలేదు. వైసీపీ నాయకులు రోజూ ఏదో ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ట్విట్టర్ లు, ఫేస్ బుక్ లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కేసులు పెడతామని చెప్పే గోరంట్ల మాధవ్.. ఎంపీ నామినేషన్ వేసే సమయానికే అతనిపై కేసులు ఉన్నాయన్న సంగతి గుర్తించుకోవాలి. అనంతపురం జిల్లాకు గోరంట్ల మాధవ్ వస్తున్నాడంటే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడో అని జనం భయపడే పరిస్థితి.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఉంది. దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి టీడీపీకి లేదు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేస్తే ఫిర్యాదు ఇస్తే రిజిష్టర్ చేసే పరిస్థితులు లేవు. ప్రభుత్వ లోపాలపై, అవినీతిపై ప్రజలు వాట్సాప్, సోషల్ మీడియా లో ఏదైనా పోస్టు పెట్టినా పెట్టిన వారి ఇండ్లకు సీబీసీఐడి వెతుక్కుంటూ వస్తున్నారు. వైసీపీ నాయకులు ఎన్ని దుర్మార్గాలు చేసినా వారిపై కేసులుండవు.

టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడాలనేది పోలీసులు ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కలెక్టరేట్ కు వెళ్లి నిరసన తెలిపే స్వేచ్ఛ ప్రజలకు లేదు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ వదిలేసి వైసీపీకి కొమ్ముకాస్తున్నారు. టీడీపీ నాయకులు రోడ్లపైకి రావద్దు, ప్రభుత్వ అవినీతిపై మాట్లాడొద్దు, నిరసన కార్యక్రమాలు చేయొద్దంటు పోలీసులు సూచనలు ఇస్తున్నారు. పోలీసులు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అందుకే వైసీపీ నాయకులు బరితెగించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఎంపి గోరంట్ల మాధవ్ పై పార్లమెంట్ లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE