– జగన్ రెడ్డికి బలహీన వర్గాలంటేనే గిట్టదు
– బీసీ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వరు
– బీసీలకు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో సగానికిపైగా ఉన్న బీసీలను అవమానిస్తూ, వారిపై సొంత కులానికి చెందిన వారితో స్వారీ చేయిస్తున్న జగన్‌పై బీసీలు తిరగబడాలని రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆయన బీసీలకు బహిరంగలేఖ రాశారు. అనగాని లేఖ పూర్తి పాఠం ఇదీ..
బీసీలకు బహిరంగలేఖ
తేదీ: 03.03.2024.
పెత్తందారీతనానికి, నియంతృత్వ పోకడలకు మారు రూపంగా నిలిచిన జగన్ రెడ్డికి బలహీన వర్గాలంటేనే గిట్టదు. గడచిన ఐదేళ్లలో ఒక్క రోజు కూడా బీసీలను పక్కన పెట్టుకోవడం గానీ, సామజికంగా రాజకీయంగా ఆర్ధికంగా ప్రోత్సహించిన దాఖలాలు గానీ లేవు. బీసీ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వరు. అకారణంగా అక్రమ కేసులతో వేధించడం. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం లాంటి చర్యలు బీసీలపై జగన్ రెడ్డికి ఉండే చిన్న చూపును బట్టబయలు చేస్తున్నాయి.
బీసీలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు పెత్తనం అప్పజెప్పి వారిని అణగదొక్కుతున్నాడు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉండే బలహీన వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసి సొంత వర్గానికి సంపద దోచిపెట్టడంపైనే జగన్ రెడ్డి దృష్టి పెట్టాడు. అనుకున్నట్లుగా దోచి పెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అండగా ఉంటూ.. ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ధైర్యంగా పోరాడుతున్న బలహీన వర్గాలపై జగన్ రెడ్డి కత్తి కట్టాడు. అక్రమ కేసులు, దాడులతో అణగదొక్కుతున్నాడు.
తాత రాజారెడ్డి హయాం నుంచి కొనసాగుతున్న బీసీ విద్రోహ వైఖరి
1. చేనేత వర్గానికి చెందిన జింకా వెంకట నర్సయ్యను దారుణంగా హత్యచేసి, ఆయన బైరటీస్ గని ఆక్రమణతో ప్రారంభమైన జగన్ తాత రాజారెడ్డి పెత్తం దారీ, దోపిడీ ప్రస్థానం అప్రతిహతంగా నేటికీ కొనసాగడం బీసీలు ఎన్నటికీ మరువలేరు
2. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు చంద్రబాబు 10శాతం పెంచగా, దానికి కోతపెట్టి 16,800 మంది బీసీలను రాజకీయ ప్రాతినిధ్యానికి దూరం చేసిన ఘనత జగ్ రెడ్డిది.
3. గత ఐదేళ్లుగా బీసీలపై జరుగుతున్న నిరంతర దాడులు, వందలాది హత్యలు దేనికి తార్కాణం? తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్యయాదవ్ వంటి ఎంతోమంది బీసీలు నిర్దాక్షణ్యంగా హత్యకు గురైనా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి నోరు విప్పి ఖండించి, వాటిని ఆపడానికి ఎట్టిప్రయత్నం చేయలేదు.
4. సామాజిక న్యాయమంటూ నిరంతరం కపట నాటకాలు ప్రదర్శించే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనుసన్నల్లో బీసీ మంత్రులకు ప్రత్యక్ష్యంగా జరిగిన పలు అవమానాలను రాష్ట్ర ప్రజానీకం ప్రత్యక్షంగా చూసింది.
5. తన సామాజిక వర్గానికి చెందిన సామంతుల ముందు బీసీ మంత్రులు మోకరిల్లడం, కూర్చోవడానికి కనీసం వారికి కుర్చీ కూడా ఇవ్వకపోవడం తో సభాంతం వరకు బేలగా నిలుచుండిపోయిన ఘట్టాలు బీసీల మనసు ల్లో నాటుకుపోయాయి.
6. బీసీలు ఎక్కువగా ఉండే జిల్లాలన్నింటిపై పెత్తనం సాగించేందుకు తన కులం వారిని నియమించుకున్న ముఖ్యమంత్రిని వంచనకు గురైన బీసీలు ఎన్నటికీ నమ్మలేరు.
7. జగన్ రెడ్డి ధన దాహానికి అధికంగా బలైంది, బలవుతున్నది బలహీన వర్గాలే. ఇళ్ల పట్టాల పేరుతో 8వేల ఎకరాల బీసీల భూములు లాక్కుని రోడ్డున పడేశారు. ఉచిత ఇసుక రద్దు చేసి ఉపాధి లేకుండా చేశాడు. అన్న క్యాంటీన్లు దెబ్బతీసి నోటి దగ్గరి తిండినీ దూరం చేసిన బీసీ ద్రోహి జగన్ రెడ్డి.
8. బీసీలకు మెరుగైన విద్య అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య లాంటి పథకాలు, పారిశ్రామిక వేత్తలుగా మార్చే పారిశ్రామిక రాయితీలు రద్దు చేసి వారిని ఎదగనీయకుండా అణగదొక్కడం జగన్ రెడ్డి పెత్తందారీ, ఫ్యాక్షన్ మనస్థత్వానికి నిదర్శనం.
9. అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక రద్దు చేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేసి, వంద మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలకు కారణం జగన్ రెడ్డి పెత్తందారీ, దోపిడీ మనస్తత్వం కాదా?
10. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం వాటా బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అప్పగిస్తామని చెప్పిన జగన్ రెడ్డి 90శాతానికి పైగా పదవులు, పనులు సొంత వర్గానికి కేటాయించి తన పెత్తందారీ వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు.
11. వందలాది మందిని సలహాదారులుగా నియమించుకుని బలహీన వర్గాల వారికి అందులో స్థానమే లేకుండా చేశాడు. పైగా సలహాదారులుగా బీసీలు పనికిరారంటూ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించడం పెత్తందారీతనం కాదా?
12. బీసీ భవన్స్ ను అర్ధాంతరంగా నిలిపివేయడం, బడ్జెట్లో కేటాయించిన నిధులు సైతం దారి మళ్లించడం, బీసీ రిజర్వేషన్లలో కోత విధించి 16,800 పదవులు దూరం చేయడం, విదేశీ విద్య, ఆదరణ లాంటి బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేయడం వంటివి బీసీల పట్ల జగన్ రెడ్డి చిన్న చూపునకు అద్దం పడుతున్నాయి.
13. రాజప్రాసాదాల్లోకి, దర్బార్లలోకి బలహీన వర్గాలకు ప్రవేశం ఉండేది కాదు. ఇప్పుడు అదే మాదిరిగా బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులకు తాడేపల్లి ప్యాలెస్‌లోకి అడుగు పెట్టనీయకుండా అవమానాలకు గురి చేశారు. నిన్న గాక మొన్న బీసీ ఎమ్మెల్యే రాయదుర్గానికి చెందిన కాపు రామచంద్రను అవమానించారు. తాడేపల్లి ప్యాలెస్ గేటు ముందే ఆయన శాపనార్ధాలు పెట్టి పార్టీకి రాజీనామా చేశాడంటే మానసికంగా ఎంతటి క్షోభకు గురి చేశారో అర్ధమవుతోంది.
జగన్ రెడ్డి వైసీపీ నేతలు ఏమన్నారో పరిశీలిస్తే…
జంగా కృష్ణమూర్తి : జగన్ ఒక అర్జునుడిలా, మేమంతా కౌరవుల్లాగ మాట్లాడుతున్నాడు. సొంత చెల్లికే గౌరవం ఇవ్వలేనివాడు, అందరు ఆడపిల్లలకు ఎలా గౌరవిస్తాడు? సామాజిక న్యాయం నేతి బీరకాయలా ఉంది. బీసీలకు న్యాయం చేసే పరిస్థితి వైసీపీలో లేదు.
ఎంపీ సంజీవ్ కుమార్ : వైసీపీలో బీసీలకు పెద్ద పీట వేస్తున్నారనేది ఒట్టి మాటే. బీసీలను అణగదొక్కుతున్నారు. నియోజకవర్గంలో పదిశాతం కూడా అభివృద్ది చేయలేకపోయాను. బీసీలను వంచించారు.
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి : నన్ను నియోజకవర్గ ప్రజలు గుర్తించినా..జగన్ మాత్రం ఎప్పుడూ గుర్తించలేదు. దురదృష్టవశాత్తు జగన్ నన్ను గుర్తించకపోయినప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.
సి. రామచంద్రయ్య : జగన్ పాలనలో వ్యవస్థలను సర్వనాశనం చేశారు. మంత్రులు మాట్లాడాల్సిన చోట సలహాదారులు మాట్లాడుతున్నారు. ఇలాంటి పాలనలో భాగస్వామ్యం కాకూడదనే వైసీపీలో నుంచి టీడీపీలోకి …
బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యం