– భార్గవ్ రెడ్డి అనే బాడ్కోకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ, జగన్ దళితులకు ఏంచేశారో చెప్పాలి
– లేకపోతే సాక్షి కార్యాలయాల ముందు ధర్నాలు చేసి, ఆస్తులు ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తున్నాం
-జగన్ ను ఏపీ పొమ్మంటుంటే, పిచ్చాసుపత్రి రమ్మంటోంది
– లోకేశ్ కు మాట్లాడటం రాదు.. నడవటం రాదు అన్నవాళ్లే ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారు
– బాబాయ్ ను ఏడు సందర్భాల్లో ఏడుసార్లు చంపించిన వ్యక్తి జగన్
– చంద్రబాబు వివేకాను చంపిస్తే, జగన్ అధికారంలో ఉండి ఏంపీకాడు?
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (ఆలూరు) టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్
వారంలో క్షమాపణ చెప్పకుంటే, టీడీపీ అనుబంధ విభాగాలతో కలిసి సాక్షి మీడియా కార్యాలయాలను ముట్టడిస్తాం : ఎం.ఎస్.రాజు
“యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీయువనేత నారాలోకేశ్ దళితులతో ముఖాముఖి సమావేశమైన సందర్భంలో మాట్లాడినమాటల్ని వక్రీకరించినందుకు సాక్షి యాజమాన్యం, ఉన్నదిలేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించి దుష్ప్రచారం చేసినందుకు వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆయనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. కడపలో చంద్రబాబు పర్యటనలో కావాలనే కొందరు వైసీపీదళితనేతలు లోకేశ్ కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. లోకేశ్ దళితుల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించినట్టు వైసీపీసోషల్ మీడియా విభాగం ఇన్ ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి, ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిరూపిస్తే, తాము, లోకేశ్ శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటారు అని ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాను.
దళితుల ముసుగులో టీడీపీని, చంద్రబాబుని, లోకేశ్ ను బదనాం చేస్తుంటే చూస్తూ ఊరుకోం
భార్గవ్ రెడ్డి అనే బాడ్కోకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ, జగన్ దళితులకు ఏంచేశారో చెప్పాలి. అంతేగానీ దళితుల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడ్డంపెట్టుకొని టీడీపీని, చంద్ర బాబు,లోకేశ్ లను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని దళితబిడ్డగా హెచ్చరిస్తున్నాను. లోకేశ్ ను బదనాంచేయడానికే వైసీపీ సోషల్ మీడియా ఫేక్ వీడియోలతో దుష్ప్రచారంచేస్తోంది. దళితుల్ని దారుణంగా వేధిస్తూ వారి మానప్రాణాలు హరిస్తున్నజగన్మోహన్ రెడ్డి, అతని ప్రభుత్వం వైసీపీలోని దళితనేతలకు ఉత్తమమైనదిగా కనిపిస్తోందా? డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడినిచేసి, అతని మరణానికి కారణమైన ఈ ప్రభుత్వం వైసీపీలోని దళితనేతలకు గొప్పప్రభుత్వమా? కడపలో చంద్రబాబును అడ్డుకున్న వైసీపీదళితనేతలకు డాక్టర్ అచ్చెన్న మరణం కనిపించలేదా?
కరోనాసమయంలో మాస్క్ లేదని దళితయువకుడిని కొట్టిచంపిన జగన్ ప్రభుత్వ ఉన్మాదపాలన కడపలో చంద్రబాబుకు అడ్డుతగిలిన వైసీపీదళిత నేతలకు కనిపించడంలేదా? తెలంగాణలో యువతిపై అత్యాచారం జరిగితే, ఇక్కడ ఉత్తుత్తి దిశాచట్టం తెచ్చిన ముఖ్యమంత్రికి, సొంత నియోజకవర్గంలో దళితమహిళ నాగమ్మపై జరిగిన దారుణం కనిపించలేదా? మరణాల్లో కూడా కులాన్ని, మతాన్నిచూసే నిజమైన దళితద్రోహి జగన్ రెడ్డే. తిరుపతి ఎంపీగా ఉన్న సొంతపార్టీకి చెందిన దళితనేత మరణిస్తే, అతని ఇంటికెళ్లి, కుటుంబ సభ్యుల్ని పరామర్శించని నీచస్వభావి జగన్. రెడ్డిసామాజికవర్గం ఎమ్మెల్సీ చనిపోతే, ప్రత్యేక విమానంలో వెళ్లిమరీ తనవర్గంనేత కుటుంబసభ్యుల్ని పరామర్శించాడు.
సాక్షి మీడియా నిర్వాహకురాలు భారతిరెడ్డికి, వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ అయిన భార్గవ్ రెడ్డికి, సలహాదారు సజ్జలకు సవాల్ చేస్తున్నాం. దళితులతో ముఖాముఖి కార్యక్ర మంలో లోకేశ్ నిజంగా దళితుల్ని అవమానిస్తూ మాట్లాడిన వీడియో ఉంటే తక్షణమే బయట పెట్టాలి. అక్కడ జరిగిన కార్యక్రమం తాలూకా వీడియోను తాముబయటపెడతాం. అలానే దానికి సంబంధించిన పూర్తివీడియోను వారు బయటపెట్టాలి. లేనిపక్షంలో భారతిరెడ్డి, బాడ్కో భార్గవ్ రెడ్డి తక్షణమే లోకేశ్ కు వారంరోజుల్లో బహిరంగక్షమాపణలు చెప్పాలి. లేకపోతే సాక్షి కార్యాలయాల ముందు ధర్నాలు చేసి, ఆస్తులు ధ్వంసంచేస్తామని హెచ్చరిస్తున్నాం.”
దళితుల ఓట్లు తప్ప, వారి మంచి చెడూ జగన్ కు పట్టవు: శ్రీరామ్ చినబాబు
“జగన్ ప్రభుత్వంలో దళితులకు మిగిలింది అవమానాలు, వేధింపులు, హత్యలు, అత్యాచా రాలే. దళితుల ఓట్లు తప్ప, జగన్ కు వారి మంచీచెడూ పట్టడంలేదు. యువగళం పాదయా త్రలో లోకేశ్ కువస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే సాక్షి మీడియా, వైసీపీపేటీఎం కుక్కలు విషప్రచారానికి తెరలేపాయి. ప్రజలసొమ్ముని జీతంగా ఇస్తూ జగన్ పెంచి పోషిస్తున్నవైసీపీ సోషల్ మీడియా విభాగం, సాక్షి యాజమాన్యం వారంలో లోకేశ్ పై కావాలనే దుష్ప్రచారం చేశామని ఒప్పుకోవాలి. చేసిన తప్పుకు ఆయనకు బహిరంగక్షమాపణ చెప్పాలి. లేకపోతే సాక్షి కార్యాలయాలను మూసేసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.”
లోకేశ్ కు మాట్లాడటం రాదు అన్నవాళ్లే, ఇప్పుడు ఆయనకు సమాధానంచెప్పలేక ప్యాంట్లు తడుపుకుంటున్నారు: డూండీ రాకేశ్
“జగన్మోహన్ రెడ్డిని ఏపీ పొమ్మంటుంటే, పిచ్చాసుపత్రి రమ్మంటుంది. తనకున్న జబ్బులకు సంబంధించి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ కంటే జగన్ ఎక్కువవేసుకుంటున్నట్టు ఉన్నాడు. దాం తో తనపిచ్చితో ప్రజల్ని, ప్రతిపక్షాలను వేధిస్తున్నాడు. లోకేశ్ యువగళం పాదయాత్ర సజా వుగా సాగుతుంటే, జగన్ కు నిద్రపట్టడంలేదు. కడుపు ఉబ్బరం ఆపుకోలేకనే జగన్ తన కటింగ్ మాస్టర్ కి చెప్పి వీడియోలు కట్ చేయించి వాటిని సోషల్ మీడియాలోకి వదిలాడు. సాక్షి మీడియాతో లోకేశ్ పై బురదజల్లుతున్నాడు. సాక్షిలో అన్నీఅసత్యాలే రాస్తారు…నిజా లు రాయరని గతంలో అసెంబ్లీలోనే జగన్ చెప్పాడు. అలాంటి సాక్షి విషప్రచారాన్ని ప్రజలు మాత్రం ఎలానమ్ముతారని జగన్ అనుకుంటున్నాడు. సాక్షి పత్రిక, టీవీకి ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధంగాఉన్నారు. లోకేశ్ పై ఇష్టానుసారం తప్పుడురాతలు రాసి, దుష్ప్రచారం చేసి, కటింగ్ వీడియోలతో కులాలు, మతాలు, ప్రాంతాలమధ్య విద్వేషాలు రాజేస్తే చూస్తూఊరుకోం. సాక్షి కార్యాలయాలను నేలమట్టం చేసేవరకు తెలుగుదేశం అనుబం ధ విభాగాలు నిద్రపోవని హెచ్చరిస్తున్నాం. లోకేశ్ కు మాట్లాడటం రాదు.. నడవటం రాదు అన్నవాళ్లే ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారు.
లోకేశ్ ఏ నియోజకవర్గంలోకి వస్తుంటే, ఆనియోజకవర్గానికి చెందిన వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు ముందే ప్రెస్ మీట్లు పెట్టి, టీడీపీయువనేతపై ఎదురుదాడికి దిగుతున్నారు. అధికారపార్టీ వారికి లోకేశ్ ను చూస్తే ఎందుకంత భయం? 4ఏళ్లల్లో జగన్ రాష్ట్రానికి, ప్రజలకు ఏంచేశాడో చెప్పగలడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీపై, చంద్రబాబు గారిపై, లోకేశ్ లపై విషప్రచారం చేయించి, జగన్ అధికారంలోకి వచ్చాడు. బాబాయ్ ను ఏడు సందర్భాల్లో ఏడుసార్లు చంపించిన వ్యక్తి జగన్. చంద్రబాబు వివేకాను చంపిస్తే, జగన్ అధికారంలో ఉండి ఏంపీకాడు? ఎన్నాళ్లుఇంకా టీడీపీ పై, చంద్రబాబు, లోకేశ్ లపై విషప్రచారంచేసి పబ్బం గడుపుకుంటావు జగన్ రెడ్డి? లోకేశ్ కు బహిరంగక్షమాపణ చెప్పకుంటే ఏపీలో సాక్షి కార్యాలయాలు ఎలా పనిచేస్తాయో, సదరు మీడియాలో పనిచేసే సిబ్బంది ఎలా స్వేచ్ఛగా ఉంటారో మేం చూస్తాం.”