ఉమ్మడి జాబితాలోని కరెంట్ అంశంపై కేంద్రం పెత్తనం ఏంటి

-ప్రజాస్వామ్య దేశంలో మల్టీ పార్టీలు ఉండకూడదా?
-అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని కేంద్రం ఏం చేసింది?
-తెలంగాణకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇచ్చింది ఏంటి?
-రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి?
-కేంద్ర విద్యుత్ బిల్లుపై అసెంబ్లీ లోచర్చ
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్ సవరణల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది.రాష్ట్రంలో రైతుల బాధాను తీర్చి ఆహార ఉత్పత్తులను పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ పథకం తీసుకొచ్చింది.

ఉమ్మడి జాబితాలోని కరెంట్ అంశంపై కేంద్రం పెత్తనం ఏంటి?ఆంధ్రకు కరెంట్ బిల్లులు 30 రోజుల్లో చెల్లించాలనిm సంబంధం లేని విషయంలో కేంద్రం తెలంగాణకు నోటీసులు జారీ చేయడం ఏంటి ఉచిత కరెంట్ ఇవ్వొద్దు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తామనడానికి వీరెవ్వరూ?

సబ్సిడీ ఇచ్చే కరెంట్ బంద్ చేస్తే కుల వృత్తుల వారు ఇబ్బందులు పడరా? వారిని ఆదుకునే వారు ఎవరు?15/09/2020 రోజున అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలు వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాము.అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని కేంద్రం ఏం చేసింది? కేంద్రం బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి?

అవసరమైన సమయానికి సరసమైన ధరలకు కరెంట్ ఇచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు సర్వ స్వతంత్రం ఉండాలి.ఆయా రాష్ర్టాల జిడిపి కరెంటుతో ముడి పడి ఉన్నది. దేశ ఆర్ధిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని ఉచితాలను బంద్ చేయాలని కేంద్రంలోని బిజెపి పెద్ద ఎత్తున చర్చ లేవనెత్తింది. పేదలకు ఇచ్చే రేషన్, ఫించన్లు, ఇండ్లు ప్రభుత్వాలు ఇచ్చే ఉచితం కాదు. వారి చెల్లిస్తున్న పన్నులను వారి బాగు కోసం వెచ్చించడమే.

బిజెపి అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లల్లో ఎన్ పి ఏ కింద పెట్టుబడిదారులకు, వ్యాపారులకు, పారిశ్రామిక వేత్తలకు రూ.12లక్షల కోట్లు మాఫీ చేశారు.పారిశ్రామిక వేత్తలైన అంబానీ, ఆధానీలు పేదవారాని మాఫీ చేశారా? వీళ్లకు మాఫీ చేసిన రుణాలను ఉచితమనాలి.నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ ఆదానీలకు ప్రైవేటు పేరిట దారా దత్తం చేస్తున్నది. 100 కోట్ల ప్రజల భవిష్యత్తును అంబానీ, ఆధానీలకు తాకట్టుపెడితే ప్రజాస్వామ్యం ఎటు పోవాలి. దేశంలో డబుల్ ఇంజన్ మాత్రమే ఉండాలా?ప్రజాస్వామ్య దేశంలో మల్టీ పార్టీలు ఉండకూడదా రాష్ర్టాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా?డబుల్ ఇంజిన్తో జనాలను సంపుతుండ్రు.

తెలంగాణకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇచ్చింది ఏంటి?విభజన హక్కు చట్టం ప్రకారం రావాల్సిన రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్శీటీ, ఇరిగేషన్ జాతీయ ప్రాజెక్టు, ఐటీఐఆర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్రం నుంచి లక్షా కోట్ల రూపాయాలు రావాలి.విభజన చట్టంలోని ఒక్క ప్రాజెక్టు అయిన తెలంగాణకు ఇచ్చారా?నరేంద్ర మోడీ నియంతృత్వ పరిపాలనలో భారత రాజ్యంగంపైన దాడి జరుగుతున్నట్టు భావిస్తున్నాను.రేషన్ దుకాణాల్లో ప్రధాని మోడీ బొమ్మ ఎందుకు పెట్టాలి.ఫోటోల కోసమే పని చేస్తున్నామా?జీఎస్టీ పేరిట పనులు వేస్తున్నందుకా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నందుకా? మోడి బొమ్మ ఎందుకు పెట్టాలి.

తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రి రేషన్ దుకాణం గురించి కాకుండ విభజన చట్టం హక్కుల గురించి మాట్లాడితే బాగుండేది.వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.త్రిఫుల్ ఐటీ బాసర, గురుకుల, ప్రభుత్వ వసతి గ్రుహాల్లో కలుషిత ఆహారం లేకుండా చర్యులు తీసుకోవాలి.

ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో వెంటనే హస్టల్స్ విజిట్ చేయించి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకొండి పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం ఇప్పించాలి.

Leave a Reply