Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఎన్టీఆర్ కాలేజీ విద్యార్ధినులకు భువనేశ్వరి అభినందన

– ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఎన్టీఆర్ కాలేజీ విద్యార్థినులు
– విజేతలకు నారా భువనేశ్వరి అభినందన
– ఎన్టీఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో బైపీసీ స్టేట్ సెకండ్ ర్యాంక్
– ఎంపీసీ స్టేట్ థర్డ్ ర్యాంక్
– ఎం ఇ సి స్టేట్ థర్డ్ ర్యాంక్స్
– సీఈసీ స్టేట్ థర్డ్ ర్యాంక్

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ఎన్టీఆర్ జూనియర్ – డిగ్రీ కాలేజీ పరీక్షా ఫలితాల్లో తనదైన ముద్ర కొనసాగిస్తోంది. తాజాగా వెల్లడయిన ఇంటర్ ఫస్ట్-సెకండియర్ పరీక్షా ఫలితాల్లో ఎన్టీఆర్ కాలేజీ విద్యార్ధినులు మెరిశారు.

ఎన్టీఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల రెండు తెలుగు రాష్ట్రాలలో నాణ్యమైన విలువలతో కూడిన విద్యని అందిస్తుంది. ఈ సంవత్సరము 2022-23 ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరాల్లో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థినిలనీ ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అభినందించారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో బైపీసీ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన హర్షిత ని, ఎంపీసీ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించిన సోనాలి ని, ఎం ఇ సి స్టేట్ థర్డ్ ర్యాంక్స్ సాధించిన జశ్విత మరియు బిందు శ్రీ, సీఈసీ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించిన స్ఫూర్తి ని నారా భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు. ఎన్టీఆర్ కాలేజీ విద్యార్ధినులకు భువనేశ్వరి అభినందన భవిష్యత్తులో తమ కాలేజీ విద్యార్థినులు ఈ ర్యాంకర్లను ఆదర్శంగా తీసుకుని, పరీక్షల్లో రాణించాలని ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE