Home » మహదేవపురంలో వైసీపీకి భారీ షాక్‌

మహదేవపురంలో వైసీపీకి భారీ షాక్‌

టీడీపీలో చేరిన 120 కుటుంబాలు
ఇంటూరి నాగేశ్వరరావుకు జైకొట్టిన మహదేవపురం

కందుకూరు: కందుకూరు మండలం మహదేవపురం గ్రామస్తులు వైసీపీకి భారీ షాక్‌ ఇచ్చారు. పంచాయతీ పరిధిలోని 120 కుటుంబాల వారు ఆ పార్టీని వీడి మాజీ ఎంపీపీ సలహాదారు గుళ్లా శ్రీనివాసరావు, బ్రహ్మ య్య, మహేంద్ర, దామచర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగే శ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. క్రాంతి నగర్‌కు చెందిన మిడసల రవి, కొండలరావు, గడిపూడి నాగేశ్వరరావు, బీసీ కాలనీకి చెందిన వార్డు మెంబర్‌ బూసి కొండలరావు, యనమల నరసింహం బ్రదర్స్‌, శ్రీనివాస కాలనీకి చెందిన కొమ్మిరెడ్డి బ్రదర్స్‌, అన్నపురెడ్డి బ్రదర్స్‌, ఎస్టీ కాలనీకి చెందిన పాలకీర్తి రమణయ్య, ఆంజనేయులు, మాల్యాద్రి కాలనీకి చెందిన పొటికలపూడి రఘు, వెంకట్రావు, కాకిబంగారక్కపాలెం గ్రామానికి చెందిన మట్టిగుంట శ్రీనివాసరావు, మెండా వెంకటేశ్వర్లు, జంగాల మాల్యాద్రి, కమతం మాల్యాద్రి, జంగాల గంగయ్య, తలారి నాగరాజు, పర్రె మాల్యాద్రి సహా అనేక కుటుంబాల వారు చేరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డెయిరీ మాజీ చైర్మన్‌ చల్లా శ్రీనివాస రావు, పార్టీ సీనియర్‌ నాయకులు కండ్రా మాల్యాద్రి, నాదెళ్ల వెంకట సుబ్బారావు, బండారు సోమరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిట్టా హరికృష్ణ, గ్రామ నాయకులు ఓరుగంటి వెంకటరావు, రాయపనేని రవి, పాపనబోయిన మురళి, గుమ్మడి మల్లికార్జున, దామా అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply