Suryaa.co.in

Andhra Pradesh

‘విశ్వ’శాంతి ధ్యేయంగా జన్మదినోత్సవాలు

భగవాన్‍ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్‍ 78వ జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆంధప్రదేశ్‍ లోని గుంటూరు సమీపంలో ‘విశ్వనగర్‍’ ఆశ్రమంలో ఈ రోజు ప్రారంభం అయిన జన్మదినోత్సవ వేడుకలు ఈ నెల ఐదు వరకు కొనసాగుతాయి. మంగళవారం శివరాత్రి కావడంతో ‘విశ్వనగర్‍’ మరింత శోభాయమానంగా వెలిగింది.

ఆశ్రమంలోని హోమశాలలో శివలింగానికి రుద్రాభిషేకం, లింగార్చనలు జరిగాయి. గురుపీఠానికి సమీపంలో ఉన్న విఘ్నేశ్వరాయలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిగాయి. నూట ఎనిమిది
viswam-1 కలశాలతో పంచామృత సహిత క్షీరాభిషేకం విశ్వంజీ స్వామి స్వయంగా నిర్వహించారు. శివపార్వతుల కల్యాణం విశ్వంజీ నేతృత్వంలో జరిగింది. అలాగే శివరాత్రి సందర్భంగా శివుని ప్రీతిపాత్రమైన సహస్రదీపాలంకరణ కూడా వైభవోపేతంగా విశ్వంజీ స్వామి చేపడుతున్న కార్యక్రమాలన్నీ విశ్వశాంతికి ఉద్దేశించినవి.

మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో ఇనకమ్‍టాక్స్ రిటైర్డ్ చీఫ్‍ కమీషనర్‍ రామకోటయ్యగారు, రిటైర్డ్ ఎస్‍పి కోటేశ్వరరావు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. తెలంగాణా, ఆంధప్రదేశ్‍ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విశ్వనగర్‍కు తరలి వచ్చారు. వీరే కాక విదేశాల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమాలకు వచ్చి ఇక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజలల్లో ఆసక్తిని కనబరుస్తూ ఎంతో భక్తితత్పరతతో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE