– బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి
సికింద్రాబాద్: బిఆర్ఎస్ కాంగ్రెస్ పరిపాలనపై విసుగు చెందిన ప్రజలు బిజెపిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు ఖాయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, ఉపాధ్యక్షులు రాచమల్ల కృష్ణమూర్తి అన్నారు.
బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి జాతీయ నాయకత్వం ప్రకటించిందని సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 38 మంది నాయకులము జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లో గత మూడు నెలల నుండి బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్నామని, తప్పకుండా దీపక్ రెడ్డి సమర్ధుడని,ఆయన చేసిన సేవలు వల్ల సునాయాసంగా గెలుస్తాడని మేకల సారంగపాణి అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్రం ఇన్చార్జిలు రాచమల్ల కృష్ణమూర్తి, కనకట్ల హరి, ప్రకాష్ గౌడ్, కన్నా బిరామ్, ప్రభు గుప్తా, గణేష్ ముదిరాజ్, శారద మల్లేష్, కొల్లి నాగేశ్వరరావు, ఆకారం రమేష్, అంబాల రాజేశ్వరరావు నీలం శ్రీనివాస్, సేతు మహేష్, సాయి దత్తు తదితరులు పాల్గొన్నారు.