Suryaa.co.in

Telangana

పేదల సమస్యలు తీరాలంటే బిజెపి అధికారంలోకి రావాల్సిందే

-మంజీరా పరివాహక గ్రామాల్లో స్థానిక ముదిరాజ్ లకు చేపలు పట్టే అవకాశం ఇవ్వాలి: సంగప్ప
-బిజెపి వత్తిడి వల్లే తడకల్ మండలం అయింది
-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప

మారుమూల నియోజకవర్గమైన నారాయణఖేడ్ లో గత 75 సంవత్సరాల నుంచి ప్రజల స్థితిగతులు ఏమి మారలేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాదే సంగప్ప అన్నారు. కంగ్టి మండలం సుక్కలతీర్థ గ్రామంలో సంగప్ప పర్యటించినారు. తమకు పెన్షన్, రేషన్ బియ్యం రావట్లేదని పలువురు సంగప్పకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ రెండు పార్టీలు మాయమాటలతో పేద ప్రజలు వంచించారని, వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని ఆయన అన్నారు. అప్పుడు గ్రామాల్లో పేదలందరికీ రేషన్ బియ్యం, అర్హులకు టెన్షన్ ఇప్పించడం తన మొదటి ప్రాధాన్యతని వాళ్లకు సంగప్ప హామీ ఇచ్చారు.

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి సంగప్ప హామీ

ఫుల్ కుర్తి తో సహా మంజీరా పరివాహక గ్రామాల్లో ముదిరాజ్ కులస్థులకు చేపల పట్టేందుకు అవకాశం కల్పించాల్సిందే అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప అన్నారు. శనివారం నాడు ఆయన పులకుర్తి, బెల్లాపూర్ గ్రామాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆ తర్వాత మంజీరా పరివాహక గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని సంగప్ప గారు హామీ ఇచ్చారు.

బిజెపి ఒత్తిడి వల్లే తడకల్ మండల ఏర్పాటు: సంగప్ప

రాష్ట్ర ప్రభుత్వం పై బిజెపి తీవ్ర వత్తిడి చేయడం వల్ల తడ్ కల్ మండలం గా మారిందని సంగప్ప పేర్కొన్నారు. తడకల్ లో బిజెపి కార్యకర్తలతో కలిసి పర్యటించిన సంగప్ప గ్రామస్తులతో మాట్లాడారు. మండల సాధన కమిటీ తలపెట్టిన నిరవధిక సమ్మెలో తాను 3 సార్లు పాల్గొన్నాను అని ఆయన తెలిపారు. తడకల్ ను వెంటనే మండలం గా ప్రకటించాలి, లేకుంటే బిజెపి అధికారం లోకి రాగానే మొట్ట మొదట చేసేది తడ్ కల్ ను మండల కేంద్రం అని తాను డిమాండ్ చేశానని గుర్తు చేశారు.

సంగప్ప వెంట బిజెపి నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, పార్టీ సీనియర్ నాయకులు సాయిరాం, గోపాల్ రెడ్డి, పట్నం మాణిక్, సగణాకర్, సతీష్, లోకేష్, సాయి సాగర్, ముప్పిడి సాయిలు, రమేష్, జనార్ధన్ పాటిల్, శ్రీకాంత్, మారుతి ముదిరాజ్, చందర్, పండరి తదితరులు ఉన్నారు.

బాధిత కుటుంబానికి సంగప్ప భరోసా

బాధిత కుటుంబానికి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప పరామర్శించి భరోసాను కల్పించారు. శనివారం మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో విలేకరి జలీల్ కుమారుడు ఆకస్మికంగా మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి సంగప్ప ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. అదే విదంగా కంగ్టి, సుక్కల్ తీర్థ్, చౌకన్ పల్లి, సిర్గాపూర్ మండల పరిధిలోని వాసర్ గ్రామంలో సంగప్ప పర్యటించారు.

వాసర్ లో రామ్ పాటిల్ ను సంగప్ప పరామర్శించారు. రాం పాటిల్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబానికి సంగప్ప ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. పలు గ్రామాలల్లో సుడిగాలి పర్యటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖేడ్ లో బీజేపీ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సంగప్ప సూచించారు. బిజెపి నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, సీనియర్ నాయకులు పట్నం మాణిక్యం, సాయిరాం, గోపాల్ రెడ్డి, జనార్దన్, ముప్పిడి సాయిలు, రమేష్, శ్రీకాంత్, సతీష్, సగనాకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE